రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన ఏపీటీఎఫ్ - ఏపీ ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన
APTF Protest : వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుత నిరసనలకు ఫెడరేషన్ నేతలు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఫెడరేషన్ నేతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాద్యాయులు నిరసనలకు వెళ్లకుండా పోలీసులు ఇప్పటినుంచే వారిని భయాందోళనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని అటంకాలు సృష్టించినా తమ నిరసనను ప్రభుత్వానికి తెలియచేస్తామంటూన్న ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నాయకులతో మా ప్రతినిధి ముఖాముఖి.
TEACHERS