ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"175 సీట్లు గెలవడం అంటే.. ఓటుకు రూ.20వేలు ఇచ్చి గెలవడమా" - భారతి రెడ్డి

Vangalapudi Anitha: కుప్పం పురపాలక సర్వసభ్య సమావేశంలో వైకాపా నేత ఓటుకు రూ.5వేలు ఇచ్చామన్న అంశంపై.. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. ఎన్నికలలో డబ్బులు ఇచ్చామని నేతలు అంటుంటే.. ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

Vangalapudi Anitha
వంగలపూడి అనిత

By

Published : Nov 2, 2022, 5:58 PM IST

Vangalapudi Anitha: కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ. 5వేలు ఇచ్చామని వైకాపా నేతలు అంటుంటే ఎన్నికల సంఘం ఏమి చేస్తుందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది కానీ,.. సీఎం సతీమణి భారతి రెడ్డి ఖజానా మాత్రం నిండుగా ఉందన్నారు. మద్యంలో 5ఏళ్లకు సరిపడా రూ.25 వేల కోట్లు భారతి రెడ్డి ఖజానాకు చేరాయని అనిత ఆరోపించారు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి సీఎం దగ్గర డబ్బులు లేవు కానీ.. ఓటుకు వేలకు వేలు ఇవ్వడానికి మాత్రం ఉన్నాయా అని నిలదీశారు. 175కి 175 గెలవడం అంటే ఓటుకి రూ.10 వేలు, 20 వేలు ఇచ్చి గెలుస్తారా అని ప్రశ్నించారు. కుప్పంలో తెదేపా నేతలను ఇబ్బంది పెట్టడం కాదు.. పులివెందుల పీఠం కదలకుండా జగన్ చూసుకుంటే చాలని హితవు పలికారు. ఏపీలో ఉంది మహిళా కమిషన్ కాదని.. అది జగన్ కమిషన్ అని ఎద్దేవా చేశారు.

తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత

ABOUT THE AUTHOR

...view details