Telugu Film Chamber: సినీ నటుడు కృష్ణ మృతిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. కృష్ణ మృతికి సంతాపంగా రేపు విజయవాడలో ఉదయం సినిమాల ప్రదర్శన నిలుపుదల చేస్తునట్లు వారు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ మరణించటం బాధాకరంగా ఉందన్నారు. విజయవాడ నగరానికి కృష్ణకు ఎనలేని అనుబంధం ఉందని వివరించారు. వ్యక్తిగతంగా కృష్ణ చాలా మంచి వ్యక్తి అని తెలిపారు.
కృష్ణ మృతికి సంతాపంగా విజయవాడలో రేపు ఉదయం సినిమాలు బంద్ - Telugu Film Chamber condoled Krishna death
Telugu Film Chamber: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు సూపర్ స్టార్ కృష్ణ మృతిపై విచారం వ్యక్తం చేశారు. సంతాపంగా రేపు విజయవాడలో ఉదయం సినిమాల ప్రదర్శనపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
![కృష్ణ మృతికి సంతాపంగా విజయవాడలో రేపు ఉదయం సినిమాలు బంద్ krishna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16935242-479-16935242-1668509078189.jpg)
krishna
ఆయన అభిమానులు కష్టంలో ఉన్నారని తెలిస్తే.. సహాయం చేసేవారని కొనియాడారు. ఆయన తన సినిమాలను విజయ నిర్మలతో కలిసి విడుదలైన మొదటి రోజు విజయవాడ వచ్చి చూసేవారని గుర్తు చేసుకున్నారు. కృష్ణ లేరనే మాటను తట్టుకోలేకుండా ఉన్నామని అవేదన వ్యక్తం చేశారు. తన అసమాన నటన ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు.
ఇవీ చదవండి: