Achchennaidu fire on cm jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ పర్యటనకు వెళ్లినా.. అదేరోజు సాయంత్రానికల్లా తాడేపల్లి ప్యాలెస్‌కు ఎందుకు చేరుకుంటారో తెలుసా.. నొక్కేసిన డబ్బును లెక్కపెట్టుకునేందుకేనని ఆరోపించారు.
టీడీపీ నూతన కార్యాలయం ప్రారంభం..విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయాన్ని నేడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..''అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని కష్టాల్లో ఉన్న రైతుల్ని బూతులు తిట్టి వక్రభాష్యాలతో సమర్ధించుకోవటం జగన్ మోహన్ రెడ్డి మంత్రులకే చెల్లుతుంది. సంక్షేమాల పేరుతో జగన్ రూ. 13 లక్షల కోట్ల అప్పు చేస్తే.. అందులో జగన్ బటన్ నొక్కింది కేవలం లక్షన్నర కోట్లు మాత్రమే. మిగిలిన పదకొండున్నర లక్షల కోట్లు తాడేపల్లి ప్యాలస్‌కే చేరింది. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ పర్యటనకు వెళ్లినా సాయంత్రానికల్లా ఎందుకు తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటాడో తెలుసా.. నొక్కేసిన డబ్బు లెక్కపెట్టుకునేందుకే. తాడేపల్లి ప్యాలెస్ డబ్బుతో నిండిపోవటంతో ఇడుపులపాయలో సొరంగాలు తవ్వి మరీ దాచిపెడుతున్నారు'' అని ఆయన అన్నారు.
జగన్ ఏకైక లక్ష్యం రాష్ట్ర వినాశనమే..అనంతరం జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈరోజు దాకా (నాలుగేళ్లు).. రాష్ట్ర వినాశనమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు ఏదైనా అవసరం రీత్యా వేరే రాష్ట్రానికి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏదో చెప్పండి అంటే చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ప్రజలున్నారని అన్నారు. 2019వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో (తెలుగుదేశం పార్టీ) ఓడిపోతామని కలలో కూడా అనుకోలేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కానీ, టీడీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎక్కడా ఏ ఒక్క తప్పు కూడా చేయలేదని గుర్తు చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో (2024) చంద్రబాబును సీఎం చేయాలి.. రాష్ట్రాన్ని, రాజధానిని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
రైతులను ఎర్రిపప్పలంటున్నారు.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు రోదిస్తుంటే.. అధికార పార్టీకి చెందిన మంత్రులు అహంకారంతో రైతులను ఎర్రిపప్పలంటూ దూషిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న రైతుల్ని బూతులు తిట్టి వక్రభాష్యాలతో సమర్ధించుకోవటం జగన్ మోహన్ రెడ్డి మంత్రులకే చెల్లిందని దుయ్యబట్టారు. విజయవాడలో బోండా ఉమా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయ ప్రారంభోత్సవానికి అచ్చెన్నాయుడుతోపాటు ఆ పార్టీ ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్ర అభివృద్ధి పట్ల, ప్రజల పట్ల, యువత పట్ల, ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సమావేశానికి విచ్చేసిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు.
ఇవీ చదవండి