ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్ వేదాలు వింటే దెయ్యాలు కూడా సిగ్గుపడుతాయి: నక్కా ఆనంద బాబు - సీఎం జగన్ పై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

Nakka Anand Babu Sensational Comments on CM Jagan: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సభలో సీఎం జగన్ మాట్లాడిన మాటలు వింటే.. దెయ్యాలు కూడా సిగ్గుపడతాయని వ్యాఖ్యానించారు. సభలో జగన్ చెప్పిన మాటలను విన్న జనమంతా పగలబడి నవ్వుకుంటున్నారని..జగన్‌ను సీఎం చేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nakka Anand
Nakka Anand

By

Published : Apr 6, 2023, 4:02 PM IST

Updated : Apr 6, 2023, 4:51 PM IST

Nakka Anand Babu Sensational Comments on CM Jagan: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నేడు జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మాట్లాడిన మాటలు వింటే.. దెయ్యాలు కూడా సిగ్గుపడతాయని వ్యాఖ్యానించారు. సభలో జగన్ చెప్పిన మాటలను విన్న జనమంతా పగలబడి నవ్వుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఈ రాష్ట్రానికి సీఎంను చేసినందుకు ప్రజలంతా సిగ్గుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ మాటలకు జనం నవ్వుకున్నారు:ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. ''పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు అని జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు జనం నవ్వుకుంటున్నారు. గొడ్డలి వేటు కుయుక్తులు, గుండెపోటు ఎత్తులు జగన్ రెడ్డికి తెలిసినట్లు మరీ ఎవరికీ తెలీదు. కోడికత్తి డ్రామాలు జిత్తులుమారి వ్యవహారం కాదా..?. తండ్రి అధికారంలోనే లక్ష కోట్లు అవినీతికి పాల్పడిన వ్యక్తి అర్ధబలం, అంగబలం గురించి మాట్లాడారు. పరదా లేకుండా ఎక్కడా ప్రయాణించలేని సీఎం.. ప్రజలతోనే పొత్తు అనటం హాస్యాస్పదంగా ఉంది. తల్లితో, చెల్లితో, బాబాయి కూతురుతో కూడా పొత్తులేని జగన్ రెడ్డి.. మానవ సంబంధాలు అంటూ వేదాలు వల్లించాడు. సొంత మీడియాతోపాటు అర్థబలంతో అంగబలంతో నీలి, కూలి, బ్లూ మీడియాలను గుప్పెట్లో పెట్టుకున్న జగన్.. మీకు మీడియా సహకారం లేదని చెప్పటం విడ్డూరంగా ఉంది. నమ్మిన వారిని నట్టేట ముంచటమే జగన్ రెడ్డి నైజం. ఈ విషయం వైసీపీ ఎమ్మెల్యేలకూ బాగా అర్ధమైంది.'' అని ఆయన వ్యాఖ్యానించారు.

సాక్షి పేపర్, ఛానెల్ ఎవరివి..?: అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్ పెట్టినా..ఆ ప్రాంతంలో పచ్చగా ఉండే చెట్లన్నీ నరికివేస్తారని నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే మీడియా వ్యవస్థల గురించి ప్రస్తావిస్తున్న సీఎం జగన్.. సాక్షి పేపర్, సాక్షి ఛానెల్ ఎవరివి? అంటూ ప్రశ్నించారు. భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీకి మీడియా ఛానెల్, పేపర్ ఉన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి మీరేనంటూ.. నక్కా ఆనంద్ బాబు గుర్తు చేశారు. ఎందుకు బహిరంగ సమావేశాలు పెడుతున్నారు..?, ప్రజలకు ఏం చెప్పాదల్చుకున్నారు..? ఏం చెప్తున్నారు..? అంటూ ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు బాగా అర్ధమైందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్‌ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజలకు నవ్వులు తెప్పించే మాటలు కాకుండా నిజాలు చెప్పాలంటూ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు హితవు పలికారు.

సీఎం జగన్ సభలో మాట్లాడిన మాటలు:సీఎం జగన్గురువారం రోజున చిలుకలూరిపేట లింగంగుంట్లలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ..''స్కాములు తప్ప స్కీములు తెలియని బాబులు.. సామాజిక న్యాయం తెలియని పరాన్న జీవులు. మీ బిడ్డను ఎదుర్కొనలేక తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయి. ఎత్తులు, జిత్తులు, పొత్తులు, కుయుక్తులతో రాజకీయాలు చేస్తున్నారు. నాకు పొత్తుల్లేవ్‌. పొత్తులపై ఆధారపడను. నాకు పొత్తు ఉంటే అది ప్రజలతోనే.'' అని ఆయన వ్యాఖ్యానించారు.

సీఎం జగన్‌పై నక్కా ఆనంద్ బాబు సంచలన వ్యాఖ్యలు

ఇవీ చదవండి

Last Updated : Apr 6, 2023, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details