Telangana Police Recruitment Board: కానిస్టేబుల్, ఎస్సై దేహదారుఢ్య పరీక్షలను డిసెంబర్ ఎనిమిదో తేదీ నుంచి నిర్వహిస్తామని పోలీస్ నియామక బోర్డ్ ప్రకటించింది. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 3 వరకు ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలని రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 11 మైదానాలను ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు వివరించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ మైదానాలతో పాటు ఈసారి ప్రయోగాత్మకంగా సిద్దిపేటలో సైతం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించబోతున్నారు.
దేహదారుఢ్య పరీక్షలకు వేళాయే.. వచ్చే నెల 8 నుంచే.. - Si Constable Updates
Si Constable Updates: డిసెంబర్ 8 నుంచి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 11 మైదానాలను సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు.
దేహదారుఢ్య పరీక్షలు
అభ్యర్థులు ఒకరోజు ముందే మైదాన కేంద్రం ఉన్న ప్రదేశానికి చేరుకుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షలకు వచ్చేటప్పుడు ఫోన్‌లు, ఆభరణాలు, హ్యాండ్ బ్యాగులు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించమని తెలియజేశారు. జనవరి మొదటి వారంలోపు దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: