YS BHARATI: అక్రమాస్తుల వ్యవహారంలో సీఎం జగన్‌తోపాటు ఆయన సతీమణి భారతికి చెందిన సంస్థల నుంచి జప్తుచేసిన స్తిర, చర ఆస్తులను విడుదల చేసి.. అందుకు సమాన విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వీకరించాలని ఈడీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అక్రమాస్తుల వ్యవహారంలో భారతి సిమెంట్స్ కేసులో 746 కోట్ల విలువైన ఆస్తుల జప్తుపై దిల్లీలోని అప్పీలేట్ అథారిటీ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది.
వైఎస్ భారతి ఆస్తుల ఈడీ అటాచ్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు
YS BHARATI: వైఎస్ భారతి ఆస్తులను ఈడీ అటాచ్‌పై తెలంగాణ హెకోర్టు విచారణ జరిపింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను తిరిగివ్వాలన్న భారతి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
దీనిపై విచారించిన హైకోర్టు... జప్తుపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో జప్తుచేసిన ఆస్తులకు సమాన విలువ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వీకరించి వాటిని విడుదల చేయాలంటూ భారతితోపాటు జగన్‌కు చెందిన సంస్థలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలుచేశాయి. వీటిపై విచారించిన హైకోర్టు స్థిర, చర ఆస్తులను విడుదల చేసి...వాటికి సమాన విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు తీసుకోవాలని ఆదేశించింది. తన పేరిట ఉన్న 14.29 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు తిరిగి ఇప్పించాలన్న భారతి అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
ఇవీ చదవండి: