High Court on MLAs Purchase Case: సిట్ విచారణకు బీఎల్ సంతోష్ గైర్హాజరుపై హైకోర్టు విచారణ చేపట్టింది. సంతోష్ సిట్ ముందు హాజరయ్యేలా ఆదేశించాలని ఏజీ కోర్టును కోరారు. ఈనెల 20న సంతోష్‌కు నోటీసులు అందినా హాజరుకాలేదని తెలిపారు. సంతోష్ విచారణకు వచ్చేలా చూసే బాధ్యత పిటిషనర్‌పై ఉందని ధర్మాసనం పేర్కొంది. నిర్దిష్ట తేదీతో మరో 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఏజీ న్యాయస్థానాన్ని కోరారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. సంతోష్‌కు మరో నోటీసు జారీ చేయాలని సిట్‌ను ఆదేశించింది. సంతోష్ ఈ మెయిల్ ఐడీకి నోటీసులు జారీ చేయాలని తెలిపింది. అన్ని వివరాలతో ఈ నెల 29న కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. తదుపరి విచారణను 30న చేపడతామని హైకోర్టు వెల్లడించింది.
సంతోష్‌కు మరో నోటీసు జారీ చేయండి.. సిట్‌ను ఆదేశించిన హైకోర్టు - BL Santhosh absence for sit investigation
High Court on MLAs Purchase Case: సిట్ విచారణకు బీఎల్ సంతోష్ గైర్హాజరుపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. బీఎల్ సంతోష్ సిట్ ముందు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయాలన్న ఏజీ నిర్ణయంతో ఏకీభవించిన ధర్మాసనం.. సంతోష్‌కు మరో నోటీసు జారీ చేయాలని సిట్‌ను ఆదేశించింది.
High Court on MLAs Purchase Case