Teachers Transfers GO Issued in AP: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకి రాష్ట్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఉన్నత, ప్రాథమిక, ఫౌండేషన్ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల నియామకం కోసం బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. 3 -10 తరగతులకు 7,928 సబ్జెక్టు టీచర్లు అదనంగా అవసరమని పాఠశాల విద్యాశాఖ అంచనా వేస్తోంది. ఇందుకోసం హెడ్మాస్టర్ గ్రేడ్ 2, సహా టీజీటీల బదిలీల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. మరోవైపు బదిలీల ప్రక్రియ కారణంగా 2022-23 విద్యా సంవత్సరం ఒడిదుడుకులకు లోను కాకుండా చూడాలని ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది.
ఉపాధ్యాయుల బదిలీలకు.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం... - Teachers Transfers Rules Guidelines
Teacher Transfers Rules in AP: కొంత కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. డిసెంబరు 12 తేదీ నుంచి జనవరి 12 తేదీ వరకూ నెలరోజుల పాటు ఈ బదిలీల ప్రక్రియ చేపట్టాలని అధికారులకు ఆదేశారు జారీ చేసింది. ఉపాధ్యాయుల బదిలీలకు సర్వీసుతో సంబంధం లేదని ప్రభుత్వం వెల్లడించింది. బదిలీల ప్రక్రియను ఆన్లైన్ దరఖాస్తు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
Teacher Transfers Rules
డిసెంబరు 12 తేదీ నుంచి జనవరి 12 తేదీ వరకూ నెలరోజుల పాటు ఈ బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. జెడ్పీ, ఎంపీపీ పాఠశాల శాల్లోని గ్రేడ్ 2 హెడ్మాస్టర్ల సర్వీసు కనీసం 5 ఏళ్లు ఉండాలని ప్రభుత్వం నిబంధనల్లో పేర్కొంది. ఉపాధ్యాయుల బదిలీలకు సర్వీసుతో సంబంధం లేదని ప్రభుత్వం వెల్లడించింది. బదిలీల ప్రక్రియను ఆన్ లైన్ దరఖాస్తు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: