Teachers strike for Old Pension Scheme: జీపీఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ల ముట్టడికి పిలుపునివ్వటంతో పలు చోట్ల ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. కొన్ని చోట్ల ముట్టడికి యత్నించిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకుని స్టేషన్లకు తరలించారు. తమకు గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చిన విధంగానే ఓపీఎస్ అమలు చేయాలంటూ ఉద్యోగులు నిధాలు చేశారు. లేకుంటే తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం:సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్యోగ, ఉపాధ్యాయలు ఫ్యాప్టో(Fapto) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ (Collectorate) ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేసి చిలకలపూడి స్టేషన్‌కు తరలించారు. గుంటూరులో కలెక్టరేట్ ముట్టడించిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. భారీ ఫ్లకార్డుల ప్రదర్శనలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విజయనగరం జిల్లా: సీపీఎస్, జీపీఎస్ వద్దు,ఓపీఎస్ (OPS) ముద్దు అంటూ ఉపాధ్యాయులు ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉద్యమంలో భాగంగా, విజయనగరం జిల్లాలో చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ కు ర్యాలీగా చేరుకుని, ధర్నా నిర్వహించారు. ఓపీఎస్ అమల్లో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నినదించారు. "హామీ ఇచ్చింది ఓపీఎస్, మమ్మల్ని ముంచే జీపీఎస్ వద్దే వద్దంటూ పేర్కొన్నారు.
Prepare GPS Proposed Ordinance as Alternative to CPS: జీపీఎస్‌లో పెన్షన్‌కు గ్యారంటీ లేనట్టేనా ?