Teacher Art on Chalk Pieces, Pencils : విజయవాడ పటమటకు చెందిన డాక్టర్ నడిపల్లి రవికుమార్.. సూక్ష్మ చిత్రాలు గీస్తూ ఇప్పటివరకు 16 ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, ఆరెంజ్ బుక్ ఆఫ్ రికార్డు, అసిస్ట్ బుక్ ఆఫ్ రికార్డు, డైమండ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, విశ్వం బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి పలు రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం పెనమలూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. పెన్సిల్‌పై అంబేడ్కర్ చిత్రాలను గీసి ప్రసంశలందుకున్న ఆయనకు ఎన్టీఆర్ పురస్కారం కూడా లభించింది. 2018 సంవత్సరానికిగానూ అతి చిన్న క్యాలెండర్ గీసి పలు ప్రపంచస్థాయి అవార్డులు సొంతం చేసుకున్నారు. సేవా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఉపాధ్యాయుడంటే పాఠశాలలోని విద్యార్థులు ఎనలేని మక్కువ కనబరుస్తుంటారు. తోటి ఉపాధ్యాయులు ఆయనలోని సేవా భావాలను ఆదర్శంగా తీసుకున్నామంటున్నారు.
మాకు చిత్రలేఖనం చాలా బాగా నేర్పిస్తారు. ఆయన నేర్పించే సమయంలో ఒక్కసారి గీయటం సరిగా రాకపోతే మళ్లీ నేర్పిస్తారు. సార్ చెప్పే మాటలు మాకు ప్రేరేపితంగా ఉంటాయి."- విద్యార్థిని, పెనమలూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
"విద్యార్థులు ఎవరేవరు ఏ ప్రతిభ కలిగి ఉన్నారో చూసి వారిని అందులో ప్రోత్సాహిస్తారు. కేవలం ఆర్ట్‌కే పరిమితం కాకుండా ఆయన సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలను ప్రొత్సహిస్తున్నారు. పిల్లలు ఆయన క్లాస్‌కి సంతోషంతో హాజరవుతుంటారు." -దుర్గాభవాని, ప్రధానోపాధ్యాయురాలు