ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Smart Meters: యూపీకి అదానీ వద్దు ఏపీకి అదానీ ముద్దు: సోమిరెడ్డి - జగన్ స్మార్ట్​గా ప్రజల జేబులు

Somireddy Chandramohan Reddy : రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లు, మోటార్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రజల నుంచి దోచుకుంటున్న17వేల కోట్ల కుంభకోణంపై సమగ్ర విచారణ జరగాలన్నారు. ఏ ఫిర్యాదు లేని మార్గదర్శిపై విశ్వసనీయత దెబ్బతీయటమే లక్ష్యంగా విచారణ చేస్తున్న సీఐడీకి, ప్రజలు జేబులు దోచుకునే ఇంత పెద్ద కుంభకోణాలు పట్టవా అంటూ సోమిరెడ్డి నిలదీశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 7, 2023, 12:08 PM IST

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్‌

Somireddy Chandramohan Reddy on Smart Meters: రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నస్మార్ట్ మీటర్లు, మోటార్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్‌చేశారు. ఏపీ ప్రజల నుంచి దోచుకుంటున్న 17వేల కోట్ల కుంభకోణంపై సమగ్ర విచారణ జరగాలన్నారు. ఏ ఫిర్యాదు లేని మార్గదర్శిపై విశ్వసనీయత దెబ్బతీయటమే లక్ష్యంగా విచారణ చేస్తున్న సీఐడీకి, ప్రజల జేబులు దోచుకునే ఇంత పెద్ద కుంభకోణాలు పట్టవా అంటూ సోమిరెడ్డి మండిపడ్డారు.

'సీఎం అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్​ రంగం కుప్పకూలింది'

ఏపిలో 36,977కు స్మార్ట్ మీటర్లు..!: మోటర్ల రేటు కంటే మీటర్ల రేటు రెండింతలు ఎలా ఎక్కువో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్‌చేశారు. ప్రకృతి, ప్రభుత్వ సంపదను కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు స్మార్ట్​గా ప్రజల జేబులు కొల్లగొడుతున్నాడని సోమిరెడ్డి ఆరోపించారు. మధ్య యుగాల్లో పిండారీ లాంటి బందిపోటు దొంగల్ని తలపించేలా జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని సోమిరెడ్డి విమర్శించారు. మెయింటెనెన్స్​తో కలిపి స్మార్ట్ మీటర్ల ధర 10వేలు ఉంటేనే యూపీ ప్రభుత్వం టెండర్లు రద్దు చేసిందని సోమిరెడ్డి వెల్లడించారు. అలాంటిది ఏపిలో 36,977కు స్మార్ట్ మీటర్లను ఎలా ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక కంపెనీకి లక్షల సంఖ్యలో మోటార్లు ఆర్డర్ ఇస్తే 50శాతం రాయితీపై ఇస్తామని చెప్తున్నారన్నారు.

Smart Meters: ప్రజలపై అదానీ స్మార్ట్​ షాక్​.. మీటర్ల ఏర్పాటు, నిర్వహణల పేరిట రూ.29వేల కోట్ల భారం

ఎల్1 ఆదానీ సంస్థ, ఎల్2 షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్: రాష్ట్రంలో వ్యవసాయ మీటర్ల ఏర్పాటు టెండర్లలో ఎల్1 షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ఉంటే ఎల్2గా ఆదానీ సంస్థ ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గృహావసరాల విద్యుత్ మీటర్ల టెండర్ లో ఎల్1 ఆదానీ సంస్థ అయితే ఎల్2 షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ నిలిచిందని ఆరోపించారు. 2రకాల టెండర్ల లో 2సంస్థలు కేవలం వందల రూపాయల తేడాతో ఎల్1, ఎల్2 లుగా నిలవడం క్విడ్ ప్రోకో కాదా అని నిలదీశారు. యూపీ వద్దు అనుకున్న అదానీ సంస్థ ఏపీకి ముద్దయిందా అంటూ సోమిరెడ్డి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినాష్ రెడ్డి తన బినామీ కంపెనీ షిరిడీ సాయి ఎలాక్ట్రికల్స్ ద్వారా భారీ దోపిడీకి తెరలేపారని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ డీల్ మొత్తం కడప షిరిడీ సాయి ఆఫీస్ లోనే జరిగిందన్నది సుస్పష్టమన్నారు. గూగుల్ టేక్ అవుట్ తీసుకుంటే ఆవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో షిరిడీ సాయి కార్యాలయంలో సీఎండీ, అధికారులు సమావేశమై ధరలు నిర్ణయించారన్నది బయటకొస్తుందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

మోటర్ల రేటు కంటే మీటర్ల రేటు రెండింతలు ఎలా ఎక్కువో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మైంటైనెన్స్ తో కలిపి స్మార్ట్ మీటర్ల ధర 10వేలు ఉంటేనే యూపీ ప్రభుత్వం టెండర్లు రద్దు చేసింది. అలాంటిది ఏపిలో 36,977కు స్మార్ట్ మీటర్లను ఎలా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ మీటర్ల ఏర్పాటు టెండర్లలో ఎల్1 షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఉంటే ఎల్2గా ఆదానీ సంస్థ ఉంది. టెండర్ల లో 2సంస్థలు కేవలం వందల రూపాయల తేడాతో ఎల్1, ఎల్2 లుగా నిలవడం క్విడ్ ప్రోకో కాదా? ఇదే అశంపై సీబీఐ విచారణ చేపట్టాలి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు

ABOUT THE AUTHOR

...view details