Atchannaidu Comments ముప్పై నాలుగు వేల కోట్ల బీసీ నిధులను దారిమళ్లించిన ద్రోహి సీఎం జగన్ అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కోత కోసి సుమారు 16, 800 రాజ్యాంగబద్దమైన పదవులను బీసీలకు దూరం చేశారని ధ్వజమెత్తారు. బీసీల అసైన్డ్ భూములు 8వేల ఎకరాలు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 650 మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని దుయ్యబట్టారు. ఆదరణ పథకం, బీసీలకు విదేశీ విద్య, పెళ్లి కానుక రద్దు చేశారని విమర్శించారు. జీవో నెంబర్ 217తో మత్స్యకారులకు ఉరితాడు బిగించారని మండిపడ్డారు. ఎన్‌హెచ్‌డీపీ పథకాలను రద్దు చేసి చేనేత కార్మికులకు సీఎం జగన్ కేంద్ర సబ్సిడీలు దూరం చేశారని ధ్వజమెత్తారు.
"రాజ్యాంగబద్దమైన పదవులను బీసీలకు దూరం చేశారు"
TDP Atchannaidu బీసీ నిధులను దారి మళ్లీంచి సీఎం జగన్ బీసీలకు ద్రోహం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లలో కోతలు పెట్టి పదవులకు దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు.
అచ్చెన్నాయుడు