TDP song Shooting in AP: ఆయా పార్టీలు చేసే మంచి పనులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే వివిధ రకాలైన సాధనాలు ఉన్నాయి. అందుకోసం పాటల ద్వారా తమ పార్టీ విశిష్టతను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీడీపీ నేతలు భావించారు. అనుకున్నదే తడువుగా అందుకు తగిన పాటను సిద్ధం చేసుకున్నారు. తమ పార్టీ చేసిన మంచి కార్యక్రమాలు, నాయకుడిని గురించిన గొప్పలక్షణాలు ఆ పాటలో తెలిపేందుకు సిద్ధమయ్యారు.
టీడీపీ అభిమానులు.. సిద్ధం చేసిన పాట మాములుగా లేదుగా..! - టీడీపీ అభిమానులు
TDP song Shooting: తెలుగుదేశం పార్టీ అభిమానులు పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ ఓ పాటను ఎన్టీఆర్ జిల్లా ఈడుపుగల్లులో షూట్ చేశారు. పాట చిత్రీకరణలో.. కంకిపాడు మండలంలోని పార్టీ అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో తెదేపా విజయం సాధిస్తుందని అభిమానులు ఆకాంక్షించారు.
తెలుగుదేశం పార్టీ విజయానికి అందించే ప్రయత్నంలో భాగంగా.. ఆ పార్టీకి చెందిన పలువురు అభిమానులు పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ పాట చిత్రికరించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఈడుపుగల్లులో పాటను చిత్రీకరణ చేశారు. పాట చిత్రీకరణ కోసం కంకిపాడు మండలంలోని పార్టీ అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో తెదేపా విజయం సాధిస్తుందని వారంతా ఆకాంక్షించారు. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత.. మా పార్టీ గెలుపుకు నాంది అని ఈడుపుగల్లు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ దేవినేని రాజా అన్నారు.
ఇవీ చదవండి: