Gorantla Buchaiah Chaudhary: సీఎం జగన్ సామాజిక వర్గానికే సలహాదారు పదవులు, డీఎస్పీ పోస్టులు ఇస్తున్నారని.. తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. డీఎస్పీల బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. గతంలో సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులకు సంబంధించి.. తెలుగుదేశం ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక.. అది తప్పుడు ప్రకటన అని అసెంబ్లీ సాక్షిగా వైకాపా ప్రభుత్వమే సమాధానం ఇచ్చిందని గోరంట్ల గుర్తు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.
ఒకే సామాజిక వర్గానికి పదవులు, పోస్టులు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
Gorantla Buchaiah Chaudhary: రాష్ట్రంలో తాజాగా జరిగిన డీఎస్పీ బదీలీలపై తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. బదిలీలలో ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు, పోస్టులు ఇచ్చారని ఆరోపించారు. ఇదే విషయంలో ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
"ఏలాంటి తప్పుడు ప్రచారాలు చేసి, కుల రాజకీయాలను తెచ్చి అధికారంలోకి వచ్చారో ఒకసారి గమనించుకోవాలి. అనాడు నువ్వు చెప్పి తప్పుడు ప్రచారం చేశావు. ఈ రోజు నువ్వు చేస్తున్నది ఏంటీ. నీకు కుల పిచ్చి ముదిరిపోయింది. అన్ని శాఖల్లో ఇలాగే చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారు సమాదానం చెప్పాల్సిన అవసరం ఉంది. సిగ్గుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఇది మంచి పద్ధతి కాదు. అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తున్నారు". - గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెదేపా సీనియర్ నేత
ఇవీ చదవండి: