ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్​సీపీ కార్యాలయానికి ప్రభుత్వ స్థలం.. మచిలీపట్నంలో ఉద్రిక్తత..

TDP : మచిలీపట్నం నడిబొడ్డున ఉన్న కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ప్రాణాలైనా ఒడ్డుతామని తెలుగుదేశం నేత కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు. రెండెకరాల స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి కేటాయించడాన్ని నిరసిస్తూ టీడీపీ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. టీడీపీ నేతలతో సహా రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. అందుకు నిరాకరించిన న్యాయమూర్తి.. కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేశారు.

kollu Ravindhra Arrest
కొల్లు రవీంద్ర అరెస్టు

By

Published : Feb 7, 2023, 10:10 AM IST

వైసీపీ ఆఫీసుకు ప్రభుత్వ భూమి కేటాయింపును నిరసిస్తూ టీడీపీ ఆందోళన

TDP Leaders Arrest : మచిలీపట్నంలో ప్రజావసరాలకు వినియోగించాల్సిన రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని వైఎస్సార్​సీపీ కార్యాలయానికి కేటాయించడంపై తెలుగుదేశం మండిపడింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, కొనకళ్ల జగన్నాథరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సోమవారం కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. మొదట ర్యాలీకి అనుమతులిచ్చిన పోలీసులు.. వైసీపీకీ కేటాయించిన భూమి వద్దకు వెళుతుండగా అడ్డుకున్నారు. రవీంద్ర తదితరులు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో తోపులాటకు దారితీసింది. కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నంలో టీడీపీ నాయకురాలు త్రిపుర స్పృహ తప్పి పడిపోయారు. కోర్టు వద్ద రవీంద్రతో పాటు ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొల్లు రవీంద్రను మొదట పెడన, బంటుమిల్లి వైపు తరలించి గూడూరుకు తీసుకొచ్చారు. కొనకళ్ల జగన్నాథరావును పెడనకు తరలించారు. అరెస్ట్ విషయం తెలిసిన టీడీపీ నేతలు దేవినేని ఉమా, రావి వెంకటేశ్వరరావు, కాగిత కృష్ణప్రసాద్‌ తదితరులు గూడూరు చేరుకున్నారు. చిలకలపూడి స్టేషన్‌లో రవీంద్రపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. రాత్రి 7గంటల సమయంలో పెడనకు తీసుకువెళ్లారు. తర్వాత మచిలీపట్నం జిల్లా ఆస్పత్రికి తరలించి, వైద్య పరీక్షల అనంతరం రెండో అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ వి.దేవిసాయి శ్రీవాణి ముందు హాజరుపరిచారు. రిమాండ్‌కు అప్పగించాలని కోరారు. అందుకు నిరాకరించిన న్యాయమూర్తి.. రవీంద్రను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని, వారం రోజుల వ్యవధిలో ఇద్దరు జామీనుదారులను హాజరుపర్చాలని ఆదేశించారు.

కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ప్రాణాలైనా ఒడ్డుతామని కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు. కృష్ణా జిల్లా నేతలపై అక్రమ కేసులు, తప్పుడు సెక్షన్‌లు పెట్టడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. బీసీ నేతల గొంతు నొక్కడంలో భాగంగానే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details