Varla Ramayya : అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీపై జాతీయ ఎస్సీ కమీషన్‌కు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.డీఎస్పీ చైతన్య దురుద్దేశపూర్వకంగా చట్టాలను తుంగలో తొక్కుతూ అమాయకులను కేసుల్లో ఇరికిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. డీఎస్పీ చైతన్యపై అనేక ప్రైవేటు కేసులు కోర్టుల్లో నమోదై ఉన్నాయన్నాయని ఆరోపించారు. గతంలోనూ ఆయన వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తొత్తుగా మారి తెలుగుదేశం కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు బనాయించారని ఆక్షేపించారు. వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని డీజీపీని కోరినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వర్ల లేఖలో పేర్కన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి విద్యార్హతలపై మాట్లాడిందని ఎస్సీ మహిళ కొంకరి కమలమ్మపై అక్రమ కేసు బనాయించారని వర్ల తెలిపారు. కమలమ్మను 41ఏ నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారని వర్ల మండిపడ్డారు. మెజిస్ట్రేట్ ఆమె జుడీషియల్ కస్టడీకి నిరాకరించి విడుదల చేశారని వర్ల రామయ్య లేఖలో గుర్తు చేశారు.
తాడిపత్రి డీఎస్పీ చైతన్యపై చర్యలు తీసుకోవాలని.. ఎస్సీ కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ - తాడిపత్రి డీఎస్పీపై జాతీయ ఎస్సీ కమీషన్‌కు ఫిర్యాదు
Varla Ramayya: అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీపై జాతీయ ఎస్సీ కమీషన్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఈ లేఖలో డీఎస్పీ చట్టాలను అతిక్రమించి అమాయకులను కేసుల్లో ఇరికిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
వర్ల రామయ్య