ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్​ చేస్తోంది.. శ్రీధర్ రెడ్డి​ వ్యాఖ్యలే నిదర్శనం: వర్ల రామయ్య - phones tapping in ap

Varla Ramaiah : వైసీపీ ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్​ చేస్తోందనడానికి కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి ఘటనే నిదర్శనమని టీడీపీ పొలిట్​ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. జగన్​ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలందరీ ఫోన్లు ట్యాప్​ చేయిస్తోందని దుయ్యబట్టారు.

Varla Ramaiah
వర్ల రామయ్య

By

Published : Jan 30, 2023, 3:33 PM IST

Updated : Jan 30, 2023, 5:15 PM IST

Varla Ramaiah Comments on Phone Tapping : టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్​తో సహా ప్రతిపక్ష నేతలందరీ ఫోన్లు జగన్​ ప్రభుత్వం ట్యాప్​ చేస్తోందని టీడీపీ పొలిట్​ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందనడానికి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్​ రెడ్డి తన ఫోన్​ను 8 నెలలుగా ట్యాప్​ చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఫోన్లు ట్యాప్ చేసే అధికారం, హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెగాసస్ ముసుగులో ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయుల్ని తక్షణమే సస్పెండ్ చేయాలని వర్ల డిమాండ్ చేశారు. ట్యాపింగ్​ వ్యవస్థను నడిపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు పదవికి రాజీనామా చేయాలన్నారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్న ట్యాపింగ్​కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రజాధనం వృథా చేసి, ఎన్నిసార్లు దిల్లీ వెళ్లినా.. అవినాష్​రెడ్డిని కాపాడలేరని ఎద్దేవా చేశారు.

వర్ల రామయ్య, టీడీపీ పొలిట్​ బ్యూరో సభ్యులు

"చంద్రబాబు ఫోన్​, వర్ల రామయ్య పోన్​, తెలుగు దేశం నేతల ఫోన్లు ట్యాప్​ చేస్తే మీకు ఏం వస్తుంది. మీ ఎమ్మెల్యే భోరున విలపించాడు. ఇంతకు మించి ఆధారం ఏం కావాలి. వ్యక్తులు దొంగచాటుగా నడుపుతున్న ప్రభుత్వమిది. ఫోన్లు ట్యాంపింగ్​ అనేది సరైంది కాదు. సీతారామంజనేయులుని వెంటనే సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేస్తున్నా." - వర్ల రామయ్య, టీడీపీ పొలిట్​ బ్యూరో సభ్యులు

ఇవీ చదవండి :

Last Updated : Jan 30, 2023, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details