TDP leader Nakka Jawahar fire On cm Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల పట్టాలు, జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన, పింఛన్ల చెల్లింపుల్లో సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు చెబుతున్నవన్నీ.. పచ్చి అబద్ధాలంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ చెప్తున్న అబద్దపు మాటలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
ఆ లెక్కలన్నీ అబద్దం: వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. 2023–24 సంక్షేమ పథకాలకు సంబంధించి మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంప కార్యాలయంలో సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారం చేపట్టిన 45 నెలల్లో వివిధ సంక్షేమ పథకాల ద్వారా (డీబీటీ, నాన్ డీబీటీ) కింద రూ.2,96,148.09 కోట్ల మేర పేదలకు లబ్ధి చేకూరిందని లెక్కలను వెల్లడించారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం చూయించిన లెక్కలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
బహిరంగ చర్చకు సీఎం జగన్ సిద్దమా..?:ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడుతూ..''జగన్ ప్రభుత్వ 4ఏళ్ల బడ్జెట్ మొత్తం రూ.9 లక్షల 39 వేల 799 కోట్లు అయితే, దానిలో కేవలం 31 శాతమే సంక్షేమానికి ఖర్చుపెట్టింది. ఆనాడూ తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమానికి 45శాతానికిపైగా ఖర్చు పెడితే.. 4 ఏళ్లలో సీఎం జగన్, అతని ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లను కొల్లగొట్టింది. ఈ లెక్కలకు సంబంధించిన వాస్తవాలను చర్చించడానికి జగన్ మోహన్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్దమా..?. మా నమ్మకం నువ్వే జగన్ అని ప్రజలకు చెప్పాల్సింది వాలంటీర్లే అంటున్న జగన్.. వారిపై పెత్తనానికి గృహసారథుల్ని, కన్వీనర్లను నియమించడం ఏమిటి..?. బీటెక్, ఎంటెక్‌లు చదివి వాలంటర్లుగా ఉద్యోగాలు చేస్తన్న వారిని జగన్, అతని పార్టీ కనీసం మనుషులుగా కూడా చూడటంలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల పనికి తగినట్టుగా వేతనం ఇస్తాము. వారి సేవల్ని మరింతగా ప్రజాసేవకు వినియోగించుకుంటుంది. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ సంక్షేమ పథకాల విషయంలో చెప్తున్న మాటలను నమ్మకండి. అవన్నీ పచ్చి అబద్దాలు, మోసాలు'' అని ఆయన అన్నారు.
రూ.3,000 వేల పింఛను హామీ ఏమైంది..?:అనంతరం ఆనాడు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకు లెక్కలేనన్నీ హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటిన్నంటినీ పక్కన బెట్టి, ప్రజలను మోసం చేస్తున్నారని నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు రూ.2,000 వేల పింఛను ఇస్తే.. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3,000 వేలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ, ఇంతవరకూ పింఛను ఇచ్చారా..? అని ప్రశ్నించారు. విజయవాడలో జగన్ ప్రమాణం స్వీకారం చేసిన రోజునే ప్రజలకిచ్చిన అన్నీ హామీలు మరిచి, మోసాలకు పాల్పడ్డారని విమర్శించారు.
ఇవీ చదవండి