Bonda Umamaheswara Rao: జీవో నెంబర్ 1పై అడిషనల్ డీజీపీ రవిశంకర్.. తాడేపల్లి స్క్రిప్టు చదివారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తాడేపల్లి ఆదేశాలతో పలమనేరు డీఎస్పీ.. చంద్రబాబుని ఆపి కుప్పంలో ఇబ్బందులు పెట్టలేదా అంటూ ప్రశ్నించారు. జీవో 1 అనేది ప్రతిపక్షాల గొంతు నొక్కడానికేనని విమర్శించారు. వైసీపీకి కొంత మంది పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. నారా లోకేశ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే డీజీపీ ఆఫీసుకి లేఖ పంపామని తెలిపారు. పోలీసులు చెప్పిన విధంగానే అనుమతి కోరుతూ లేఖ పెట్టినా ఇంతవరకు సమాధానం రాలేదని బొండా ఆక్షేపించారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే జీవో నెం 1: టీడీపీ నేత బొండా ఉమ - Andhra Pradesh Latest News
Bonda Umamaheswara Rao: అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ మీద టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. పోలీసులు.. వైసీపీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. నారా లోకేశ్ పాదయాత్రకు అనుమతి కోసం డీజీపీ ఆఫీసుకి లేఖ పంపితే.. ఇంతవరకు సమాధానం లేదని తెలిపారు.
వైసీపీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారు: టీడీపీ నేత బోండా ఉమ