Nara Lokesh Padayatra: టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ మహాపాదయాత్రకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 27వ తేదీ నుంచి కుప్పం వేదికగా ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఇంకో నెల రోజుల సమయం ఉండటంతో పార్టీ నేతలు దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను ఖరారు చేస్తున్నారు. హంగూ..ఆర్బాటం లేకుండా సాదాసీదాగా పాదయాత్ర జరిగేలా చూడాలని లోకేశ్ సూచించారు. పాదయాత్రకు పేరు, ముహర్తం ఖరారైనట్టు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను పార్టీ ముఖ్య నేతలు రేపు మీడియా సమావేశంలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
తెలుగు తమ్ముళ్లకు శుభవార్త.. నారా లోకేశ్ పాదయాత్ర పేరేంటో తెలుసా..! - టీడీపీ వార్తలు
Nara Lokesh Padayatra: టీడీపీ కార్యకర్తలకు శుభవార్త అందనుంది. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ మహాపాదయాత్రకు సంబంధించిన పేరు, ముహూర్తం ఖరారు అయ్యాయి. దీని వివరాలను పార్టీ ముఖ్య నేతలు రేపు మీడియా సమావేశంలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
నారా లోకేశ్ పాదయాత్ర