ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ప్రతిపక్షనేతగా కోతలు.. ప్రభుత్వ అధినేతగా వాతలు" - ప్రతిపక్షనేత

Nara Lokesh: ప్రభుత్వం గిరిజనులకు దళితులకు ఇస్తున్న ఉచిత విద్యుత్​ ఎత్తివేయటంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ స్పందించారు. కొత్త ఎత్తుగడలతో ఉచిత విద్యుత్​ ఎత్తివేయటం జగన్​రెడ్డి బాదుడే బాదుడుకు నిదర్శనమని దుయ్యబట్టారు.

Nara Lokesh
నారా లోకేశ్

By

Published : Nov 26, 2022, 4:21 PM IST

Nara Lokesh Comments: ప్రతిపక్షనేతగా కోతలు కోయటం, ప్రభుత్వ అధినేతగా వాతలు పెట్టడం జగన్ రెడ్డి మోసపు నైజమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. నిరుపేద గిరిజనులు, దళితులు 200 యూనిట్ల లోపు ఇస్తున్న ఉచిత విద్యుత్ ఎత్తేసేందుకు.. ఆరు దశల పరిశీలన పేరుతో కొత్త ఎత్తుగడ వేయడం జగన్ రెడ్డి బాదుడే బాదుడు పరిపాలనకి నిదర్శనమని మండిపడ్డారు. ఒక్క అల్లూరి జిల్లాలోనే 20 వేలకిపైగా గిరిజన కుటుంబాలకు వైసీపీ సర్కారు ఉచిత విద్యుత్ లేకుండా చేస్తోందని.. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది గిరిజనుల ఇళ్లల్లో చీకట్లు నింపుతోందని దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్ ఎత్తేస్తూ దగా చేయటమే కాకుండా.. పాతబకాయిల పేరుతో వేధించడం దారుణమన్నారు. అమాయక, నిరుపేద గిరిజనుల్ని ఇలా దోచుకోవడం అన్యాయమని లోకేశ్‌ విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details