NARA LOKESH: అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివిలా టమాటా రైతుల పరిస్థితి ఉండగా.. అన్నదాతలను ఆదుకుంటానని మాటిచ్చి తప్పిన ముఖ్యమంత్రి ఏ పరదాల మాటున దాక్కున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. మార్కెట్లో టమాటా కిలో 20 రూపాయలకు పైన అమ్ముతూ.. రైతు దగ్గర కిలో ఒక రూపాయికే కొంటుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. అన్నింటికీ జిందా తిలిస్మాత్‌లా పని చేస్తాయని చెప్పిన జగన్ నాటక రైతు భరోసా కేంద్రాలు ఏం చేస్తున్నాయనని అన్నారు.
"అన్నదాతలను ఆదుకుంటానని మాటిచ్చి తప్పిన సీఎం ఎక్కడ" - నారా లోకేశ్
NARA LOKESH: రాష్ట్రంలో టమాటా రైతుల పరిస్థితి దారుణంగా మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతిపక్షనేతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటానని రైతులకు మాటిచ్చి.. ఇప్పుడు మాట తప్పుతున్నాడని లోకేశ్ ఆరోపించారు.
విత్తనాల నుంచి విక్రయం వరకూ అన్నదాతకు అన్యాయం చేయడమేనా మీరు తీసుకొచ్చిన రైతు రాజ్యమా అని ధ్వజమెత్తారు. వైకాపా పెట్టిన రూ.3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఎలుకలు కొట్టేశాయా లేక ఉడతలు ఊదేశాయా అని లోకేశ్ ఎద్దేవాచేశారు. టమాటా రైతులకు మద్దతు ధర రాకపోతే పంట భద్రపరచడానికి ఏర్పాటు చేస్తానన్న కోల్డ్ స్టోరేజ్‌లు ఏవని అడిగారు. టమాటా ఎక్కువగా పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా టమాటా పేస్ట్, సాస్, కెచప్ తయారీ అంటూ ఊరించినవి ఉత్తుత్తి కోతలేనా అని ఆక్షేపించారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి టమాటా రైతులకు ఇచ్చిన హామీ వీడియోను లోకేశ్ తన ట్విట్టర్‌కు జత చేశారు.
ఇవీ చదవండి: