TDP Nara Lokesh Fire on CM Jagan: సీఎం జగన్‌కు కళ్ల ముందు తన దారుణ ఓటమి కనిపిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. జగన్ ప్రజా విశ్వాసం కోల్పోయారని.. చివరికి సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. కడప జిల్లాలో, పులివెందులలో జగన్ పునాదులు కదులుతున్నాయని.. ఈ ఫ్రస్టేషన్లోనే జగన్ అక్రమ కేసులతో టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.
Lokesh on TDP Incharges Arrest: కడప జిల్లాలో ప్రొద్దుటూరు ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి(Proddutur Incharge Praveen Kumar Reddy), పులివెందుల ఇంఛార్జ్ బీటెక్ రవి అరెస్టు(Btech Ravi Arrest)లతోనే ప్రతిపక్షం అంటే జగన్ ఎంతగా భయపడుతున్నాడో అర్థమవుతోందని లోకేశ్ అన్నారు. పులివెందులలో టీడీపీ స్పీడు పెరగడంతో జగన్ తన మార్క్.. అక్రమ కేసులతో భయపెట్టే చర్యలకు దిగాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రోజుకో నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ అరెస్టు జగన్‌లో మొదలైన అలజడికి నిదర్శనమన్నారు.
ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ హాస్పటల్స్‌కు బకాయిలు వెంటనే విడుదల చేయాలి: నారా లోకేశ్
TDP Nara Lokesh on Farmers Problems in AP: కడప జిల్లాలో, పులివెందులలో తీవ్ర వర్షాభావంతో రైతులు బాధలు పడుతుంటే వారి సమస్యపై దృష్టిపెట్టని సీఎం.. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులే తనకు ప్రాధాన్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. సీఎంగా ఉండి సొంత నియోజకవర్గ రైతుల సమస్యలు తీర్చలేని జగన్.. చివరికి పులివెందుల ప్రజల నమ్మకాన్ని కూడా కోల్పోయారని లోకేశ్ అన్నారు. ప్రతిపక్ష నేతల కేసులపై రివ్యూలు పెట్టి మరీ అరెస్టులు చేయిస్తున్న జగన్ సర్కారు.. ముందు రైతాంగ సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.