MLC Ashok Babu on Due to Unemployment: దేశంలోనే యువత బలవన్మరణాల్లో ఏపీ ముందుండటం ప్రభుత్వానికి సిగ్గుచేటు అనీ, టీడీపీ నేతలు అశోక్ బాబు , పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. జగన్ అసమర్థత, అవినీతి, ధనదాహం వల్ల శక్తిసామర్థ్యాలున్న ఏపీ యువతను బలి అవుతున్నారని వారు ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,575 మంది బలవంతంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నే విషయం కేంద్రప్రభుత్వం నివేదికలతో తెటతెల్లమైందని పేర్కొన్నారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆశోక్ బాబు డిమాండ్ చేశారు. 2.30లక్షల ప్రభుత్వఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, ఏటాడీఎస్సీ అన్న జగన్ హామీలు ఎప్పుడు అమలవుతాయని అశోక్‌బాబు నిలదీశారు. నాడు 2.30లక్షల ప్రభుత్వఉద్యోగాలను భర్తీ చేస్తానని అన్న జగన్, నేడు 66వేలు మాత్రమే ఖాళీలు ఉన్నాయంటున్నారని అశోక్ బాబు మండిపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేయక, ప్రైవేట్ రంగంలో ఉపాధిఅవకాశాలు పెంచలేని జగన్ అసమర్థత.. యువత చావులకు ప్రధానకారణమని దుయ్యబట్టారు. సీఎం జగన్ 4ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని 25ఏళ్లు వెనక్కునెట్టారని విమర్శించారు. లక్షలకోట్ల అప్పుల్లో ముంచడమే జగన్ సాధించిన అభివృద్ధని అశోక్ బాబు ఎద్దేవా చేశారు. యువశక్తి జగన్ పై ఆగ్రహావేశాలతో ఉందని పేర్కొన్నారు. మెున్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలే ఇందు నిదర్శనమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువత ఆశల్ని, ఆశయాల్ని నిజంచేస్తుందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు స్పష్టంచేశారు.
'వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల నుంచి సరైన నొటీఫికేషన్ ఇవ్వలేదు. ఇచ్చినా.. కేవలం వందల్లో మాత్రమే ఖాళీలు చూపించారు. రాష్ట్రంలో ఒక్క టీచర్ ఉద్యోగాలకు సంబందించి 50 వేల ఖాళీలు ఉన్నాయి. మెగా డీఎస్సీ వేస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. అసెంబ్లీలో తమ పార్టీ అడిగిన ప్రశ్నిలకు.. రాష్ట్రంలో 66వేయిల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. వైసీపీ నాయకులు దందాలతో జాకీ లాంటి కంపెనీ ఏపీ నుంచి పారిపోయింది. చదువుకన్న విద్యార్థులు తాము ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. వైసీపీ పరిపాలనలో యువత గంజాయి తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏపీ కంటే వెనకబడిన బీహార్ లో సైతం ఆత్మహత్యలు తక్కువగా ఉన్నట్లు కేంద్ర నివేదికలు వెల్లడిస్తున్నాయి.'- అశోక్ బాబు, టీడీపీ ఎమ్మెల్సీ
పల్లా శ్రీనివాసరావు: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలుమార్లు దిల్లీ పర్యటనకు వెళ్లడంలో రహస్యమంతా గూగుల్ ద్వారా వెల్లడైందని, ప్రజలు వీటన్నింటిని గమనిస్తున్నారని తెలుగుదేశం పార్టీ విశాఖపార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. జగన్ కేవలం తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నిత్యం దిల్లీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నా ఎటువంటి చర్యలు లేకపోవడాన్ని తప్పుబట్టారు. పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగ అవకాశాలు అంటూ ప్రకటనలు చేసి, యువతను జగన్ మోసం చేశారన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు వల్ల నిరుద్యోగులు చనిపోయిన పరిస్థితి నెలకొందన్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇవీ చదవండి: