TDP Leaders Reaction on YCP New Incharges : అధికార వైసీపీ 11 నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లను నియమించింది. మార్చిన స్థానాల్లో అభ్యర్థులు గెలవరని కాదని, కొత్త స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తారని మార్చినట్లు వైసీపీ పెద్దలు చెబుతున్నారు. అయితే నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించినా వైసీపీ గెలుపు అసాధ్యమని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీ అభ్యర్థులను కాదు కదా స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడిని మార్చినా వైసీపీ గెలుపు అసాధ్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు (TDP state president Atchannaidu) అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఇంకా మూడు నెలలే గడువు ఉందని తెలిపారు.
వైసీపీ ఇంచార్జ్‌లు నియామకం - మార్పుల వెనుక డబ్బు-లాబీయింగ్ గట్టిగా పని చేసిందని ప్రచారం
Bonda Uma Criticized the YCP Party :ఎన్నికలకు మూడు నెలల ముందే వైసీపీ చేతులు ఎత్తేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ విమర్శించారు. ఐ ప్యాక్ సర్వేల్లో వైసీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమని తేలిందన్నారు. ఒక నియోజకవర్గానికి చెల్లని కాసులు మరొక నియోజకవర్గానికి ఎలా పనికి వస్తారని ప్రశ్నించారు. వై నాట్ 175 అన్న పార్టీ, ఇప్పుడు జగన్ టికెట్ ఇస్తానన్నా నేతలు వద్దు అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే క్యూలో నిలబడేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జనవరి ఒకటి నాటికి వైసీపీ దివాళా బోర్డు పెట్టడం ఖాయమని విమర్శించారు. కొంత మంది ఎమ్మెల్యేలు పోటీ చేయడానికి ఇష్టం లేక ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
వైఎస్సార్సీపీ నూతన ఇన్‌చార్జ్‌లు నియామకం - నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కార్యకర్తల హుకుం
TDP Leaders Respond on YCP new Incharges : జగన్‌ని మార్చాలని ప్రజలు డిసైడ్ అయ్యాక ఎంత మంది ఇన్‌చార్జ్‌లను మార్చినా ఫలితం లేదని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ విమర్శించారు. చివరికి అధ్యక్షుడిగా జగన్ తప్పుకొని తన కుటుంబ సభ్యులకు బాధ్యతలు ఇచ్చినా, వైసీపీ పార్టీని ఎవరూ కాపాడలేరన్నారు. ఈ ప్రభుత్వానికి బుల్లెట్ ఎప్పుడో దిగిందని ఇంకా వారికి తెలియడం లేదని ఆక్షేపించారు. తెలంగాణలో ఫలితాలు చూసి జాగ్రత్త పడాలని జగన్ అనుకుంటున్నాడు, కానీ ఇక్కడ ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు.