TDP Leaders Rally Against Chandrababu Arrest in AP :తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ అనంతపురంలో టీడీపీ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించగా డాక్టర్లు, న్యాయవాదులు నిలువరించారు. చిలకలూరిపేటలో మాజీమంత్రి పుల్లారావు ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్షలు కొనసాగాయి. వెలగపూడి వద్ద రైతు పులి చిన్నాను పోలీసులు అడ్డుకోగా గుణదలకు వెళ్తున్నట్లు చెప్పడంతో చివరకు అనుమతించారు. చంద్రబాబు త్వరగా బయటకు రావాలంటూ గుణదల మేరీ మాత ఆలయంలో చిన్నా కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు.
TDP Leaders Fires On YSRCP :విజయవాడలో టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తిరువూరులో పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. మైలవరంలో దీక్షా శిబిరాన్ని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో వందలాది మంది మహిళలు నల్ల బెలున్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో తెలుగు యువత నాయకులు కృష్ణా నదిలో జలదీక్షలు చేపట్టారు.
TDP Activists Protest Across Andhra Pradesh: చంద్రబాబు అరెస్ట్‌పై ఆగని ఆందోళనలు.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
TDP Agitations on CBN Arrest in AP :నారా చంద్రబాబు నాయుడుని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనంద రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముమ్మిడివరంలో రిలే నిరహార దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. రాజోలులో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వర్షంలోనూ దీక్షలను కొనసాగించారు.
State Wide Protest Against Chandrababu Arrest :తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి నాయకులతో కలిసి బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. నిడదవోలులో తెలుగుదేశం పార్టీ దీక్షలకు జనసేన పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
Statewide Protests Against Chandrababu Arrest బాబు అరెస్టుపై కొనసాగుతున్న నిరసనల వెల్లువ.. ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు..
విశాఖలో దీక్షా శిబిరాన్ని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సందర్శించి సంఘీభావం తెలిపారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ చేపట్టిన కాగడాల ర్యాలీని పోలీసులు అడ్డుకుని నాయకులను అరెస్టు చేశారు. భీమునిపట్నంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇంఛార్జి రాజబాబు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. రాజాంలో మాజీ మంత్రి మురళీ మోహన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో భారీగా టీడీపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్వతీపురం జిల్లా వీరఘట్టంలో, నర్సిపురంలో దీక్షా శిబిరాలకు మహిళలు, రైతులు తరలి వచ్చి మద్దతు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో దీక్షా శిబిరానికి వచ్చిన ఓ పాప బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే పాట పాడి అందరిని ఆకట్టుకుంది.
Statewide Protest Against Chandrababu arrest రాష్ట్రవ్యాప్తంగా ఉధృతరూపం దాల్చుతున్న నిరసనలు.. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఊరువాడ ఆందోళనలు