BC Cell: విజయవాడలోని గొల్లపూడి బీసీ సంక్షేమ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో పార్టీ బీసీ నేతలు కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం దగ్గరకు వచ్చి ఆందోళన చేసిన టీడీపీ నేతలు.. భవనానికి తాళాలు వేసి ఉండటంతో పగలకొట్టే యత్నం చేశారు. ఆందోళన చేస్తున్న నేతలు పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.
జగన్ ప్రభుత్వంలో బీసీలకు తీరని అన్యాయం: టీడీపీ - ఏపీ తాజా వార్తలు
BC Cell: విజయవాడలోని బీసీ సంక్షేమ కార్యాలయం వద్ద బీసీ నేతలు ఆందోళన చేశారు. జగన్ ప్రభుత్వంలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో పార్టీ బీసీ నేతలు కార్యాలయాన్ని ముట్టడించారు. జగన్ సీఎం అయ్యాక 26 మంది బీసీలను చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ బీసీ సెల్
జగన్ ప్రభుత్వంలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని కొల్లు రవీంద్ర విమర్శించారు. 56 కార్పొరేషన్లు పెట్టి రూపాయి నిధులు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జగన్ సీఎం అయ్యాక 26 మంది బీసీలను చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు అన్యాయం చేస్తే బీసీ మంత్రులు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. కనీసం అధికారులు కూడా కార్యాలయాల్లో లేరంటే ఏ విధమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి: