ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP : చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత కొడాలి నానికి లేదు : టీడీపీ నేతలు - gudivada mla

TDP : టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన కృష్ణా జిల్లా పర్యటన విజయాన్ని చూడలేక వైసీపీ నేతలు పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తే వైసీపీ నేతలు సర్వనాశనం చేయటానికి చూస్తున్నారని మండిపడ్డారు.

tdp leaders
టీడీపీ నేతలు

By

Published : Apr 14, 2023, 6:15 PM IST

Updated : Apr 15, 2023, 6:25 AM IST

TDP Leaders Fires on Kodali : గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు గుడివాడ పర్యటన విజయవంతం కావడంతో కొడాలి నానికి కళ్లు బైర్లు కమ్మాయని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ దుయ్యబట్టారు. తన రాజకీయ భవిష్యత్తు ఏంటో అర్ధమై నాని పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. పర్యటన విజయంతో నాని.. గుడివాడకు చంద్రబాబు ఏం చేశారని పిచ్చి ప్రేలాపన చేస్తున్నాడని విమర్శించారు. సుమారు ఎనిమిది వేల టిడ్కో ఇళ్లను చంద్రబాబు నిర్మించారన్నారు. ఆ ఇళ్లను వైసీపీ ప్రభుత్వం పేదలకు పంచలేదు. వైసీపీ నేతలు సెంటు భూమి పేరుతో.. ఎమ్మెల్యేలు కమిషన్ల కోసం కొత్త పథకాన్ని తీసుకువచ్చారని మండిపడ్డారు. గుడివాడకు ఎన్నో మంచి పనులు చేసిన చంద్రబాబు.. చేసిన ఒకే ఒక చెడ్డ పని కొడాలి నానికి టిక్కెట్ ఇవ్వటమేనని దుయ్యబట్టారు. చంద్రబాబు గురించి మాట్లాడే ఆర్హత నానికి లేదని అన్నారు. నమ్మిన వారిని మోసం చేయటం తప్ప నానికి మరేమి తెలియదని మండిపడ్డారు.

కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే రకం కొడాలి నాని అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటన విజయవంతంగా కొనసాగుతోందని.. దారి పొడవునా ప్రజలు చంద్రబాబుకు నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. ప్రజల కళ్లలో సంతోషం చూస్తుంటే గుడివాడను కాపాడే ఏకైక నాథుడు చంద్రబాబు అన్నట్లుగా ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు చూస్తుంటే.. సర్వనాశనం చేసేందుకు వైసీపీ నేతలు చూస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే వాళ్లని.. అందుకే చంద్రబాబు కుటుంబంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.

బందరు పోర్టు నవయుగకు ఇచ్చింది వైఎస్ హయాంలో అని కూడా తెలీయకుండా కొడాలి నాని మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల్ని తూలనాడే కొడాలి నాని లాంటి వారికి భూమి మీద ఉండే అర్హత లేదని మాజీమంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కాళ్లపై పడి బీఫామ్ తీసుకున్న విషయం కొడాలి నాని మరిచిపోయాడా అని నిలదీశారు. అసత్యాలతో గుడివాడ ప్రజల్ని 20ఏళ్లుగా కొడాలి నాని మోసగిస్తూ వస్తున్నాడని గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన 800కు పైగా గుడివాడలోని టిడ్కోఇళ్లు పేదలకు ఎందుకు పంచలేదని ప్రశ్నించారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 15, 2023, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details