ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చింతలపూడిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు.. అచ్చెన్నాయుడు ఆగ్రహం - జగన్ పై అచ్చెన్నాయుడు విమర్శలు

Removal of NTR idol: ఎన్టీఆర్ జిల్లా చింతలపూడిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించారు. దీనిపై తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు పాల్పడిన ఒక్క నాయకుడిపై ఎటువంటి చర్య ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

Achchennaidu
అచ్చెన్నాయుడు

By

Published : Dec 8, 2022, 5:22 PM IST

NTR Statue Removed: చింతలపూడిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించడం.. జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అసమర్థత పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తూ, ధ్వంసం చేస్తూ వైకాపా నాయకులు వికృతానందం పొందుతున్నారని అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్​కు అవమానిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యలకు పాల్పడిన ఏ వ్యక్తిపైనా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details