TDP LEADERS FIRES ON CM JAGAN : సీఎం జగన్ ప్రారంభించింది జగనన్న భూరక్ష పథకం కాదని.. భూభక్ష పథకమని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. ఇదేం ఖర్మరా అంటూ జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఉన్న పాస్ పుస్తకాలను ఇళ్లలో పెట్టుకునేందుకు ప్రజలు ఇష్టపడట్లేదన్నారు. జగన్‌కు ఏమాత్రం సరిపోని, సరితూగని విధంగా నీతికబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. భూముల్ని కాజేసిన దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్న జగన్ రెడ్డి.. సర్వేలు, భూరక్షణల పేరుతో భూకబ్జాకు తెరలేపారని ధ్వజమెత్తారు.
అభివృద్ధి అంటే చంద్రబాబు.. విధ్వంసం అంటే జగన్: టీడీపీ నేతలు - tdp leader somireddy fires on cm jagan
TDP LEADERS FIRES ON CM : శ్రీకాకుళం పర్యటనలో చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించారు. అరాచకం అంటే గుర్తొచ్చే పేరు జగన్‌ది అని విమర్శించారు. తనకు ఏ మాత్రం సరిపోని, సరితూగని సూక్తులు చెప్పటం జగన్‌కి సూటుకాలేదని ఎద్దేవా చేశారు.
అరాచకం అంటే జగన్: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చంద్రబాబును ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరాచకం అంటే గుర్తొచ్చే పేరు జగన్మోహన్రెడ్డిదని.. అభివృద్ధి అంటే గుర్తొచ్చే పేరు చంద్రబాబుదని స్పష్టం చేశారు. ఇంట్లో ఉండి ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన మహాతల్లిని పక్కన పెట్టుకుని పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. బంధిపోటులతో పోల్చుకోవాల్సిన వ్యక్తి.. ఎన్టీఆర్, ఎంజీఆర్‌లతో పోల్చుకోవటమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: