Crop Damage :ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట నీళ్లపాలైందని కర్షకులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పడిన వర్షానికి పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల కారణంగా రైతు కష్టం నీళ్లలో తడిసిపోయింది. ఆ నష్టాన్ని గుర్తించి రైతు కష్టానికి సరైన విధంగా తగిన నష్ట పరిహారం ఇవ్వాలని టీడీపీ నాయకులు విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
TDP Leaders On Crop Loss Compensation: అకాల వర్షాల కారణంగా పంట దెబ్బ తిన్న రైతులను అదుకుని తగిన నష్ట పరిహారం ఇవ్వాలంటూ టీడీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి దేవినేని ఉమా, మాజీమంత్రి నెట్టం రఘురాం, టీడీపీ నేత శ్రీరాం తాతయ్యలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. కానీ ప్రభుత్వం మాత్రం 60 వేల ఎకరాల్లో 34 కోట్లు మాత్రమే నష్టం జరిగిందని చెప్పడమంటే తప్పించుకోవడమే అని నేతలు ఆరోపించారు. దాంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి దళారులు వచ్చి రైతుల వద్ద నుంచి మొక్కజొన్నను తక్కువ ధరకు కొనుక్కెళ్తున్నారని తెలిపారు. ఇంకా మిగతా పంటలైన జొన్న, మిర్చి, కూరగాయ పంటలను పట్టించుకునేవారు లేరు.