TDP leaders complained to the Governor: మాచర్ల హింసపై టీడీపీ నేతల బృందం నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. ఇవాళ గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో ఆరుగురు సభ్యులతో కూడిన తెలుగుదేశం బృందం కలిసింది. నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులుతో పాటు పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, వర్ల రామయ్య, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లు గవర్నర్‌ను కలిశారు. మాచర్ల హింసాత్మక ఘటనలో బాధితులైన టీడీపీ నేతలపైనే పోలీసులు ఏకపక్షంగా హత్యాయత్నం కేసులు పెట్టారని ఫిర్యాదు చేయడంతో పాటు దాడికి ముందు వైసీపీ నేతలు మారణాయుధాలతో తిరిగిన వీడియోలను అందుకు సంబంధించిన సాక్ష్యాలను అందించారు.
మాచర్ల హింసాత్మక ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు ... - Macherla latest news
TDP leaders complained to the Governor: మాచర్ల హింసపై టీడీపీ నేతలు ఇవాళ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. మాచర్ల హింసాత్మక ఘటనలో బాధితులైన టీడీపీ నేతలపైనే పోలీసులు ఏకపక్షంగా హత్యాయత్నం కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు.
మాచర్ల హింసాత్మక ఘటనపై గవర్నర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు