TDP Yanamala on State Debts: అప్పులపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు సిద్ధమా అని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు సవాల్ విసిరారు. దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచాడని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ వ్యవహారాల్లో లంచాలు తగ్గాయనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్‌కు పడిపోనుందన్నారు.
దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచాడు: యనమల - టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు
TDP Yanamala on State Debts: దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచాడని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. అప్పులపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గతం కంటే తక్కువ అప్పులు చేశామని చెబుతున్నవి పచ్చి అబద్ధాలు అని మండిపడ్డారు.
TDP
జగన్ రెడ్డి దుర్మార్గ పాలనతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని ఆక్షేపించారు. 1956 నుంచి 2019 వరకు అప్పటి ప్రభుత్వాల అప్పు రూ.2 లక్షల 53వేల కోట్లు అయితే..., వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలోని అప్పు రూ.6 లక్షల 38వేల కోట్లు అని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం లెక్కలు, నివేదికలు ఇవ్వడం లేదని కాగ్ చెబుతోందని దుయ్యబట్టారు. కార్పొరేషన్ల బ్యాలెన్స్ షీట్లను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 25, 2022, 4:14 PM IST