TDP leader Yanamala Ramakrishnudu: పోలవరం ప్రాజెక్టు సందర్శనకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు వెళ్లగా.. పోలీసులు అనుమతి నిరాకరించిన ఘటనపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు స్పందించారు. పోలవరం ఏమైనా నిషేధిత ప్రాంతమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబును ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు దేశంలో ఎవరైనా సందర్శించే హక్కు ఉందని యనమల తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం, జగన్ రెడ్డి అక్రమాలు బయటపడతాయనే చంద్రబాబుని అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్లు దండుకోవడం తప్ప.. పోలవరంలో మీరు సాధించిన పురోగతి ఏంటి అని ప్రశ్నించారు.
పోలవరం ఏమైనా నిషేధిత ప్రాంతమా..!: యనమల రామకృష్ణుడు
Yanamala Ramakrishnudu on Polavaram incident: ప్రభుత్వ వైఫల్యం, జగన్ రెడ్డి అక్రమాలు బయటపడతాయనే.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబును వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఏమైనా నిషేధిత ప్రాంతమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాజ్మహల్ ఆగ్రాలో ఉంది కాబట్టి సరిపోయింది,.. ఆంధ్రాలో ఉంటే దానిలో ఉన్న పాలరాయిని కూడా జగన్ రెడ్డి అమ్మేసేవాడని ఎద్దేవా చేసారు.
TDP leader Yanamala
తెదేపా హయాంలో ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసి ప్రాజెక్టు పురోగతిని ప్రజలకు చూపించామని గుర్తు చేసారు. కానీ మీరు ప్రతిపక్షనేతనే అడ్డుకోవడం మీ అసమర్థ పాలనకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది కాబట్టి సరిపోయింది, ఆంధ్రాలో ఉంటే దానిలో ఉన్న పాలరాయిని కూడా జగన్ రెడ్డి అమ్మేసేవాడని ఎద్దేవా చేసారు.
ఇవీ చదవండి: