Yanamala Rama Krishnudu Comments: సీఎం జగన్ అబద్ధాలకు, అప్పులకు అంతే లేకుండా పోతోందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. చంద్రబాబు ప్రగతిపథంలో నడిపిన నవ్యాంధ్రను జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అత్యంత కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను జగన్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఏపీ జీవనాడి పోలవరాన్ని నిలిపేయడం జగన్ రెడ్డి దుర్మార్గ పాలనకు నిదర్శనమని యనమల పేర్కొన్నారు. రైతులకు ఉపయోగపడే పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. గతంలో ఇచ్చిన సున్నా వడ్డీ, పావలా వడ్డీ, పంట రుణాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని యనమల ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం అప్పులకు అబద్ధాలకు అంతే లేకుండా పోతోంది:తెదేపా నేత యనమల - నవ్యాంధ్ర
YANAMALA: ముఖ్యమంత్రి జగన్పై తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శల వర్షం కురింపించారు. చంద్రబాబు ప్రగతిపథంలో నడిపిన నవ్యాంధ్రను జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. నవ్యాంధ్రలో గతంలో ఇచ్చిన పంట రుణాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయటం లేదని ఆరోపించారు. చిన్న సన్నకారు రైతులకు అందించే సహాయన్ని నిలిపివేశారని అన్నారు.
చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే స్ప్రేయర్లు, డ్రిప్ ఇరిగేషన్, పవర్ టిల్లర్లు, యంత్ర పరికరాల సరఫరాను నిలిపేశారని యనమల అన్నారు. ఎన్‌సీఈఆర్‌టి నివేదిక ప్రకారం 2017తో పోల్చుకుంటే 2021లో విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యతా ప్రమాణాలు దిగజారాయన్నారు. తెదేపా హయాంలో చేసిన అప్పులు దాదాపు రెండున్నర లక్షల కోట్లయితే.. వైకాపా ప్రభుత్వం మూడున్నరేళ్లలోనే 4 లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. విశాఖలో విలువైన ప్రభుత్వ భూములు అమ్మేయడం, ప్రజల భూములు లాక్కోవడమే ఉత్తరాంధ్రకు చేసిన మేలా అంటూ యనమల రామకృష్ణుడు నిలదీశారు.
ఇవీ చదవండి: