Varla ramaiah comments on Jagan : సొంతబాబాయ్ వివేకా హత్యకేసు పొరుగు రాష్ట్రానికి బదిలీ అయినప్పుడే వైసీపీ ప్రభుత్వం మానసికంగా చచ్చిపోయిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్‌రెడ్డి అసమర్థపాలన చూసి ఇదేమీ ఖర్మ మన రాష్ట్రానికి అని చంద్రబాబు ముందు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. కమీషన్ల కోసం పరిశ్రమను తరిమేసిన ఎమ్మెల్యే తోపుదుర్తిని కట్టడిచేయలేని జగన్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడిగా బలహీనమైన వ్యక్తి కారా... అని నిలదీశారు. మూడున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందేమో చెప్పగలరా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వం మానసికంగా చచ్చిపోయింది: వర్ల రామయ్య - NTR distruct latest news
Varla ramaiah comments on Jagan: జగన్ పాలనపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్జారు. వివేకాహత్య కేసు పొరుగు రాష్ట్రానికి బదిలీ అయినప్పుడే వైసీపీ ప్రభుత్వం మానసికంగా చచ్చిపోయిందని.. మూడున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందేమో చెప్పగలరా? అని ప్రశ్నించారు.
వర్లరామయ్య