Liquer scasm: గత మూడున్నరేళ్లలో విజయవాడ విమానాశ్రయం కేంద్రంగా జరిగిన స్పెషల్ ఫ్లైట్ల నిర్వహణ, రాకపోకలపైనా ఈడీ విచారణ జరపాలని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. జెట్ సెట్‌గో సంస్థ సీఈఓగా వ్యవహరిస్తున్న కనికారెడ్డి.. శరత్ చంద్రారెడ్డి భార్యేనని, ఈమె విజయసాయిరెడ్డి అల్లుడికి వదిన అని వెల్లడించారు. విజయవాడకు సీఐఎస్ఎఫ్ భద్రత చంద్రబాబు హయాంలోనే మంజూరైనా ఇంతవరకూ అమల్లోకి రాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుందని దుయ్యబట్టారు. విజయవాడ విమానాశ్రయంలో ఏ ఒక్క వైఎస్సార్సీపీ నేతనీ పోలీసులు తనిఖీలు చేయట్లేదని విమర్శించారు. ఓ అధికారి భార్య ఇటీవల బంగారంతో పట్టుబడినా అంతా కప్పిపెట్టారని ఆరోపించారు. ఏరికోరి వీఎన్. భరత్ రెడ్డిని విమానయాన శాఖ సలహాదారుగా నియమించుకోవటం వెనుక ఆంతర్యం ఏంటని నిలదీశారు.
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ విచారణ జరిపించాలి: పట్టాభిరామ్ - Begumpet Airport
Liquer scasm: దిల్లీ లిక్కర్ స్కామ్ మూలాలన్నీ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల చుట్టూనే తిరుగుతున్నాయని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొల్లగొట్టిన నలధనమంతా వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారని ఆరోపించారు. బేగంపేట విమానాశ్రయంతో పాటు విజయవాడ విమానాశ్రయం పైనా ఈడీ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్