Vivekananda Reddy murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ రెడ్డి పాత్రపై ప్రజలకు ఉన్న అనుమానాలను తీర్చాలని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు వివేక హత్యకు కారణమైన వారిని పట్టుకోకపోవడం చూస్తే.. జగన్కు ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. వివేకా హత్యకేసులో నిందితులను పట్టుకునే విషయంలో జగన్ అవలంబిస్తున్న తీరు చూస్తే.. అతని నిబద్ధత ఎలాంటిదో తెలుస్తుందని ఆరోపించారు. జగన్ చెల్లి వైఎస్ సునీత విచారణ జరిగే తీరుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందన్నారు.
సోషల్ మీడియాలో 'అబ్బాయి కిల్డ్ బాబాయ్' హ్యాష్ ట్యాగ్: తెదేపా నేత పట్టాభిరామ్ - TDP leader Pattabhi ram media conference
TDP leader Pattabhi ram: వివేకా నిందితులను ఎప్పుడు బయటపెడతారోనని.. మూడున్నరేళ్లుగా ప్రజలు ఎదురు చూస్తుంటే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు తేలుకుట్టిన దొంగలా నోరు మెదపటం లేదని, తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ నిలదీశారు. వైఎస్ సునీత పోరాటానికి పార్టీలకు అతీతంగా తాము అండగా నిలబడతామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు కూడా సునీత పోరాటానికి అండగా నిలవాలని పట్టాభిరామ్ కోరారు.
వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి జగన్కు.. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పది ప్రశ్నలు వేశారు. అబ్బాయి కిల్డ్ బాబాయ్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వస్తున్నట్లు తెలిపారు. తాను వేసే పది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు.వివేకా నిందితులను ఎప్పుడు బయట పెడతారోనని ప్రజలు ఆసక్తిగా మూడున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు తేలుకుట్టిన దొంగలా నోరు మెదపడంలేదని పట్టాభిరామ్ నిలదీశారు. వైఎస్ సునీత పోరాటానికి పార్టీలకు అతీతంగా తామ ఆమెకు అండగా నిలబడతామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు కూడా సునీత పోరాటానికి అండగా నిలవాలని పట్టాభిరామ్ కోరారు.
ఇవీ చదవండి: