ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pattabhi: సీఎం జగన్​ వేల కోట్ల దోపిడీకి సిద్ధమయ్యారు: తెదేపా నేత పట్టాభి - తెదేపా నేత పట్టాభి కీలక వ్యాఖ్యలు

TDP leader Pattabhi: వ్యవసాయ మీటర్ల కొనుగోళ్లలో జగన్​ రూ.వేల కోట్ల దోపిడీకి సిద్దమయ్యారని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. తనకు రావాల్సిన వాటా కోసం జగన్​మోహన్​రెడ్డి అతృతగా ఎదురుచూస్తున్నారని దుయ్యబట్టిన పట్టాభి... ఇప్పటికే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు వివిధ రూపాల్లో వందల ఎకరాల భూమి కట్టబెట్టారని విమర్శించారు. ఇప్పటికే రూ.వేల కోట్లు విద్యుత్ సబ్సిడీ బకాయిలు పెట్టిన ప్రభుత్వం, మీటర్ల సబ్సిడీ నగదు ఎలా సకాలంలో చెల్లిస్తుందని ప్రశ్నించారు.

TDP leader Pattabhi
తెదేపా నేత పట్టాభి

By

Published : Oct 26, 2022, 12:16 PM IST

TDP leader Pattabhi: వ్యవసాయ మీటర్ల కొనుగోళ్లలో రూ.వేల కోట్ల దోపిడీకి జగన్​మోహన్​రెడ్డి సిద్దమయ్యారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. జగన్​మోహన్​రెడ్డికి అత్యంత సన్నిహితులైన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ మీటర్ల కొనుగోళ్లు, అమరికలో చక్రం తిప్పుతున్నారని మండిపడ్డారు. తనకు రావాల్సిన వాటా కోసం జగన్​మోహన్​రెడ్డి అతృతగా ఎదురుచూస్తున్నారని దుయ్యబట్టిన పట్టాభి.., ఇప్పటికే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు వివిధ రూపాల్లో వందల ఎకరాల భూమి కట్టబెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో విలువైన భూములన్నీ షిరిడీ సాయి, అదానీ, అరబిందో సంస్థలకే కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు.

రూ.35వేలు ఖర్చు చేసి మీటర్లు కొనుగోలు చేయట్లేదంటూ పెద్దిరెడ్డి చెప్పిందంతా అసత్యాలేనని, 2వారాల క్రితమే రూ.6500కోట్లు పైచిలుకు ఖర్చు చేస్తున్నట్లు సీఎంకు విద్యుత్ శాఖ అధికారులు నివేదిక ఇచ్చారని గుర్తుచేశారు. మంత్రి రూ.1150కోట్లు మాత్రమే మీటర్ల కొనుగోళ్లకు ఖర్చు చేస్తున్నామంటూ అబద్ధాలు చెప్పారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రికి విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక తప్పా లేక మంత్రి పెద్దిరెడ్డి చెప్పింది అసత్యమా? అని నిలదీశారు. దోపిడీ బహిర్గతమైన వాటికి సమాధానం చెప్పకుండా మీడియా సంస్థల్ని నిందిస్తే సరిపోదని హితవు పలికారు. ఇప్పటికే రూ.వేల కోట్లు విద్యుత్ సబ్సిడీ బకాయిలు పెట్టిన ప్రభుత్వం, మీటర్ల సబ్సిడీ నగదు ఎలా సకాలంలో చెల్లిస్తుందని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details