Lokesh On TDP Women Leaders Arrest: వైసీపీ ప్రభుత్వ తీరుపై శాంతియుతంగా నిరసన తెలిపిన టీడీపీ దళిత మహిళా నేతలు అసిలేటి నిర్మల, సునీతరాణిల అరెస్ట్.. జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనకి పరాకాష్ట అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. సీఎం జగన్ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లిందని పోలీసులు కేసు నమోదు చేయడం హాస్యాస్పదమని విమర్శించారు.
32 క్రిమినల్ కేసుల్లో నిందితుడు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన హంతకుడు, సొంత బాబాయ్‌ని చంపించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని మండిపడ్డారు. నోటితో బూతుల వాంతులు చేసుకునే క్యాసినో కేటు కొడాలి నానికి గౌరవ మర్యాదలు ఎక్కడున్నాయని నిలదీశారు. ఇదే చట్టం అందరికీ అమలైతే.. నాటీ సీఎం చంద్రబాబుని నడిరోడ్డుపై నరికేయాలన్న ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి పై ఎన్ని కేసులు పెట్టాలని ప్రశ్నించారు.