ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"దళిత అధికారుల్ని బలిపశువుల్ని చేయాలనే కుట్రతో జగన్​ వ్యవహరిస్తున్నారు" - ఏపీ తాజా వార్తలు

Nakka Anandababu: సీఎం జగన్​, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తీరుపై తెదేపా నేత నక్కా ఆనందబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత అధికారులను బలిపశువులను చేయాలని సీఎం జగన్​ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Nakka Anandababu
తెదేపా నేత నక్కా ఆనందబాబు

By

Published : Oct 26, 2022, 12:17 PM IST

Nakka Anandababu: దళిత సమాజంపై ప్రభావంపడేలా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వ్యవహారశైలి ఉందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో దళిత అధికారుల్ని బలిపశువుల్ని చేయాలనే కుట్రతో జగన్​మోహన్​రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఐడీ ప్రజలకోసం పనిచేయకుండా వైకాపా అనుబంధ విభాగంగా పనిచేస్తోందని విమర్శించారు. జగన్​మోహన్​రెడ్డి, సజ్జల ఆడమన్నదే ఆడటంగా సీఐడీ వ్యవహరించటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతలు ఇచ్చిన దాదాపు 300కుపైగా ఫిర్యాదుల్లో ఏ ఒక్కదానిపైనా సీఐడీ ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details