TDP Leader Kollu Ravindra Visited Pedapatnam: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్లక్ష్య పాలన కారణంగా నీళ్లు లేక సుమారు 1000 ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోయాయని.. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు గగ్గోలు పెడుతున్నా.. అధికారులు, మంత్రులు పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు. మచిలీపట్నం నియోజకవర్గం పెదపట్నం గ్రామంలో పర్యటించిన కొల్లు రవీంద్ర.. నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.
Kollu Ravindra Comments:కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..'' వైఎస్సార్సీపీ ప్రభుత్వం నీళ్లు అందించకపోవడంతో సుమారు 1000 ఎకరాలు మేర పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. పట్టిసీమ ద్వారా నీళ్లు అందించాలని గొప్ప ఆలోచనతో ఆనాడు చంద్రబాబు అడుగులు వేస్తే.. దురుద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి ప్రాజెక్టులను మంట కలిపాడు. ఈ ముఖ్యమంత్రి స్వార్ధ రాజకీయాలు వల్ల కృష్ణా జలాలపై హక్కును పొగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యేకు మైనింగ్ మాఫియా మీద ఉన్న దృష్టి.. రైతులకు సరైన సమయంలో నీళ్లు అందించే విషయంపై ఆలోచన లేదు. ఈ ప్రభుత్వం తక్షణమే రైతులకు నీళ్లు అందించి ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతాం.'' అని ఆయన హెచ్చరించారు.
Kanakamedala Complaint on YSRCP Govt: ఏపీలో మానవ హక్కుల అణచివేత.. జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఫిర్యాదు
Kollu Ravindra Fire on Cm Jaagn: రాష్ట్ర రావణాసురుడు సీఎం జగనేనని.. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. త్వరలో రాబోయే ఎన్నికల్లో.. ప్రజలను మోసం చేయటానికి మంత్రులతో కలసి సిద్దమవుతున్నారని మండిపడ్డారు. కల్తీ మద్యం వల్ల 40వేల మందికి పైగా ఆనారోగ్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు, ఎస్సీలకు ఏ ఒక్క సంక్షేమ పథకం లేకుండా ఉత్తుత్తి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు, విధులు లేని పదవులను అంటగట్టారని ఆగ్రహించారు.