TDP Leader Kollu Ravindra Comments On Ganja: రాష్ట్రంలో గంజాయిని అరికట్టాలని లేదంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. తాడేపల్లిలో సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఇటీవల జరిగిన అంధ బాలిక హత్యను ఖండించారు. బాలిక ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలో మైనర్ అంధ బాలికను కిరాతకంగా హత్య చేస్తే ముఖ్యమంత్రి ఎం చర్యలు చేపట్టారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు అసలు భద్రత లేకుండా పోయిందన్నారు. విచ్చల విడిగా మాధక ద్రవ్యాలు, మందు, గంజాయి రాష్ట్రంలో లభ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చేతకాని తనం వల్ల మహిళలపై రోజు రోజుకు దాడులు పెరిగి పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు జగన్ను అనుసరిస్తున్నారని విమర్శించారు.
గంజాయి మూలాలు ఏపీలోనే: మహిళ హోం మినిస్టర్ ఉన్నా మహిళలపై దాడులు ఆగడం లేదు, మహిళలకు న్యాయం జరగడం లేదని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా గంజాయి దొరికిన ఏపీలోనే మూలాలు దొరుకుతుందడం సిగ్గు చేటని ఆక్షేపించారు. నూతనంగా వచ్చిన గవర్నర్కు విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి ఎలాగూ పట్టించుకోవడం లేదు మీరైనా మహిళల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలనీ కోరుతున్నామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తతో వుండాలి. ఈ గంజాయి పై పోరాటం చేద్దాం అని కొల్లు రవీంద్ర పిలుపు నిచ్చారు.