Kalavenkata Rao Comments: విజయనగరం జిల్లా రామతీర్థంలోని రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసి రెండేళ్లు గడిచినా జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని టీడీపీ నేత కళావెంకట్రావు ధ్వజమెత్తారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా.. 2020 డిసెంబర్ 30న రాముని విగ్రహాన్ని ధ్వసం చేసి కోనేరులో పడేశారని మండిపడ్డారు. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథాన్ని దగ్ధంచేస్తే పిచ్చివాడి చర్యగా కొట్టిపారేశారని ఆక్షేపించారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆగ్రహజ్వాలలు పెల్లుబికడంతో.. సీబీఐ విచారణకు సిఫార్సు చేశారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 285 దేవాలయాలు, హిందూ దేవుళ్ల విగ్రహాలపై దాడులు జరిగాయన్నారు. రామతీర్థం సహా ఇందులో ఏ ఒక్క ఘటనలోనూ దోషులను పట్టుకోలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామతీర్ధం ధ్వంసానికి రెండేళ్లు.. దోషులు ఇంకా దొరకలేదా..!: తెదేపా నేత కళా - రామతీర్థం ఘటనకు రెండేళ్లు
Kalavenkata Rao Comments: రామతీర్థంలోని రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసి రెండేళ్లు గడిచినా.. ఇప్పటికీ దోషులను పట్టుకోలేక పోయారని టీడీపీ నేత కళావెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథాన్ని దగ్ధంచేస్తే పిచ్చివాడి చర్యగా కొట్టిపారేశారని ధ్వజమెత్తారు.
కళావెంకట్రావు