ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏసీ రూముల్లో కుర్చోని.. రండి రండి అంటే పెట్టుబడులు రావు: జీవీ రెడ్డి

GV Reddy: ముఖ్యమంత్రి జగన్, మంత్రులు ఏసీ రూముల్లో కుర్చోని మేము పెట్టుబడులు ఆమోదిస్తున్నాం అంటే పెట్టుబడులు రావంటూ.. టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి విమర్శించారు. జగన్ పోలీసులకు భవిష్యత్​లో జీతాలకు బదులు బాండ్లు ఇవ్వబోతున్నాడని విమర్శించారు. పుట్టబోయే బిడ్డపై కూడా రూ.2లక్షల అప్పులభారం వేసిన జగన్ రెడ్డి, ఇప్పటివరకు 10లక్షల14వేలకోట్ల అప్పులుచేశాడని ఎద్దేవా చాశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 8, 2023, 2:02 PM IST

Updated : Feb 8, 2023, 2:20 PM IST

TDP spokesperson GV Reddy:ముఖ్యమంత్రి జగన్, మంత్రులు ఏసీ రూముల్లో కుర్చోని మేము పెట్టుబడులు ఆమోదిస్తున్నాం అంటే పెట్టుబడులు రావంటూ టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి విమర్శించారు. పెట్టుబడుల పేరుతో ప్రజల్ని వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. పరిశ్రమల శాఖ మంత్రి పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లకపోవడంపై జీవీ రెడ్డి విమర్శలు చేశారు. దావోస్ వెళ్లక పోవడంపై మంత్రిని ప్రశ్నిస్తే.. చలి అధికంగా ఉందనే కారణంతో వెళ్లలేదని సమాధానం ఇచ్చారని ఎద్దేవా చేశారు. మంత్రి విశాఖలోని తన ఇంట్లో కుర్చుంటే పెట్టుబడులు రావంటూ జీవీ రెడ్డి అన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పెట్టుబడులు ఏవిధంగా వచ్చాయో ప్రజలు చూశారనీ... ఇప్పుడున్న ప్రభుత్వం ఏసీ గదుల్లో కుర్చోని రండి రండి అంటే పెట్టుబడులు వస్తాయా అని ప్రశ్నించారు.

అప్పుల్లో ముందున్న జగన్ రెడ్డి మెప్పుకోసం పనిచేస్తున్న పోలీసులకు భవిష్యత్​లో జీతాలకు బదులు బాండ్లు ఇవ్వబోతున్నాడని జీవీ రెడ్డి విమర్శించారు. అప్పుల్లో దూసుకుపోతున్న జగన్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వాలంటీర్లకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి వచ్చిందని మండిపడ్డారు. జనవరి నెలలో రుణాలు, పన్నులద్వారా రూ.20వేలకోట్లు పోగేసిన ప్రభుత్వం ఫిబ్రవరి 8వ తేదీ వచ్చినా 20శాతం జీతాలే చెల్లించిందని ధ్వజమెత్తారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏలు, పీఆర్సీ బకాయిలు, టీఏలు అన్నికలిపి ఉద్యోగులకు దాదాపు రూ.25వేలకోట్లవరకు చెల్లించాల్సి ఉందన్నారు. పుట్టబోయే బిడ్డపై కూడా రూ.2లక్షల అప్పులభారం వేసిన జగన్ రెడ్డి, ఇప్పటివరకు 10లక్షల14వేలకోట్ల అప్పులుచేశాడని గుర్తు చేశారు. కట్టుకథలు, కాకమ్మకబుర్లు, తప్పుడురాతలతో యువతను, నిరుద్యోగుల్ని ముఖ్యమంత్రి ఎంతకాలం మోసగిస్తాడని నిలదీశారు..?

'పెట్టుబడుల పేరుతో ప్రజల్ని జగన్, మంత్రులు మోసం చేస్తున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి పెట్టుబడుల కోసం దావోస్ కోసం వెళ్లకపోవడంపై ప్రశ్నిస్తే..అక్కడ మైనస్ 5 డిగ్రీల చలి ఉందని వెళ్లలేదని సమాధానం ఇచ్చారు. విశాఖలో ఇంట్లో కుర్చుంటే పెట్టుబడులు వస్తాయా. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పెట్టుబడులు ఏవిధంగా వచ్చాయో మీరు చూశారు. సీఎం, మంత్రులు ఏసీ గదుల్లో కుర్చోని రండి రండి అంటే పెట్టుబడులు వస్తాయా? ఈ ప్రభుత్వంలో ప్రతి వ్యక్తి పేరు మీద రెండు లక్షల అప్పు ఉంది. పట్టబోయే బిడ్డపై సైతం రెండు లక్షల అప్పు ఉంది.'- జీవీ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి

ఇవీ చదవండి:

Last Updated : Feb 8, 2023, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details