ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్​సీపీ నుంచి మరోసారి పోటీ చేసేందుకు ఎమ్మెల్యేలు జంకుతున్నారు: దేవినేని ఉమ - నందిగామ నియోజకవర్గం

Devineni Uma :రాబోయే ఎన్నికలలో వైఎస్సార్​సీపీ నుంచి పోటీ చేయటానికి మంత్రులు, ఎమ్మెల్యేలు జంకుతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శించారు. ఒక్క చాన్స్​ అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు రేటింగ్​ రోజు రోజుకు పడి పోతోందని అన్నారు.

Devineni Uma
దేవినేని ఉమ

By

Published : Feb 8, 2023, 11:42 AM IST

Updated : Feb 8, 2023, 1:43 PM IST

Devineni Uma : రాష్ట్రంలో వైఎస్సార్​సీపీ నుంచి మరోసారి పోటీ చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు జంకుతున్నారని.. తెలుగుదేశం నేత దేవినేని ఉమ అన్నారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై.. ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ ఓ మహిళను కించపరిచేలా మాట్లాడుతుంటే.. ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని దేవినేని ఉమ ప్రశ్నించారు. నందిగామలో ఇటీవల చంద్రబాబు రోడ్‌షో విజయవంతం కావడంతో వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిద్రపట్టడం లేదని.. అందుకే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ నియోజకవర్గంలో భారీగా మట్టి, ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఇవన్నీవైఎస్సార్​సీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగుతున్నాయని ఆరోపించారు. గంజాయి, నాసిరకం మద్యం, లాటరీ టిక్కెట్ల, డ్రగ్స్‌ విక్రయాలను నేతల అనుచరులే నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

తెలుగుదేశం నేత దేవినేని ఉమ

"ఎమ్మెల్సీ అరుణ్​ కుమార్​ తప్పు చేస్తున్నాడు. తప్పు మాట్లాడాడు మహిళ అనే గౌరవం లేకుండా, శాసన సభ్యురాలుగా పనిచేసిన మహిళపై ఎమ్మెల్సీ ఇలా మాట్లాడుతుంటే ఎమ్మెల్యే ఖండించకూడదా. ఆమెపై, ఆమె కుటుంబసభ్యులపై చేసిన ఆరోపణలన్ని ఖండిస్తున్నాము. టీడీపీ నాయకులం అందరం పూర్తిగా తంగిరాల సౌమ్యకు అండగా ఉంటాం." -దేవినేని ఉమ, టీడీపీ నేత

ఇవీ చదవండి :

Last Updated : Feb 8, 2023, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details