Bonda Uma Comments on DGP: లోకేశ్ పాదయాత్రపై డీజీపీ తలా తోకా లేని ప్రశ్నలు అడుగుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. పాదయాత్రకు ఎటువంటి అనుమతి అవసరం లేదని పోలీసు యాక్ట్ చెప్తోందన్న ఆయన.. పాదయాత్రకు కేవలం సమాచారం ఇస్తే చాలని రాజ్యంగం చెప్తోందన్నారు. డీజీపీ తాడేపల్లి స్క్రిప్ట్ తమకు పంపడం వల్ల ఉపయోగం లేదన్నారు. 4కోట్ల ఏపీ జనాభా లోకేశ్ పాదయాత్రలో పాల్గొంటుందని తెలిపారు. 4 కోట్ల ఏపీ జనాభా ఓటర్ లిస్ట్ కావాలి అంటే డీజీపీకి పంపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. లోకేశ్ పాదయాత్ర ఆపాలి అని చూస్తే ఊరుకోమని, తర్వాత జరిగే పరిణామాలకు సీఎం, డీజీపీలదే బాధ్యత అని బొండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. విజయవాడలోని బొండా ఉమా నివాసంలో లోకేశ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
లోకేశ్ పాదయాత్రపై డీజీపీవి తలాతోకా లేని ప్రశ్నలు : టీడీపీ నేత బొండా ఉమ - lokesh padayatra latest updates
Bonda Uma Comments on DGP: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రపై డీజీపీ అనవసరమైన సమాచారం అడుగుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. పాదయాత్రకు ఎటువంటి అనుమతి అవసరం లేదని.. కేవలం సమాచారం అందిస్తే చాలని రాజ్యాంగం చెప్తోందని ఆయన తెలిపారు.
బొండా ఉమ
"డీజీపీ తలా తోకా లేని సమాచారాన్నీ.. ప్రశ్నల్నీ అడుగుతున్నారు. ఈ రాష్ట్ర డీజీపీగా అడుగుతున్నారా లేదంటే తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలను చదువుతున్నారా అని అర్థం కాని పరిస్థితి. 4000 కిలో మీటర్లు.. 400 రోజుల పాదయాత్రలో.. దాదాపు 4 కోట్ల మంది.. లోకేశ్ గారి పాదయాత్రలో కలిసే అవకాశం ఉంది. అంటే డీజీపీ 4 కోట్ల మంది పేర్లు అడుగుతున్నారు". - బొండా ఉమామహేశ్వరరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు
ఇవీ చదవండి: