ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP Leader Beda Ravichandra Yadav : 'మార్గదర్శిపై విషం చిమ్మేందుకే యూరిరెడ్డి పాత్ర.. వైసీపీ జేబు సంస్థ సీఐడీ' - టీడీపీ నేత బీదా రవిచంద్ర యాదవ్ వార్తలు

TDP Leader Beda Ravichandra Yadav on Margardarsi Issue: ఈనాడు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుని ఏదో రకంగా అరెస్టు చేయాలనే కుట్రతోనే వైఎస్ జగన్ రెడ్డి జగన్నాటకానికి తెర తీశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం నిబంధనలకు విరుద్ధంగా పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

Beda_Ravichandra_Yadav_on_Margardarsi
Beda_Ravichandra_Yadav_on_Margardarsi

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 6:22 PM IST

TDP Leader Beda Ravichandra Yadav on Margardarsi Issue: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరో కొత్త నాటకానికి తెర తీశారని.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ ఆగ్రహించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థలపై ఇప్పటికే అనేక ఆరోపణలు, కుట్రలు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. తాజాగా మార్గదర్శిపై విషం చిమ్మేందుకు యూరిరెడ్డి పాత్రధారిని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. యూరిరెడ్డి చేసిన ఆరోపణలపై మార్గదర్శి ఎప్పుడో అన్ని ఆధారాలతో కూడిన వివరణ ఇచ్చిందని బీదా రవిచంద్ర యాదవ్ వివరించారు.

Beda Ravichandra Yadav Fire on Yuri Reddy:మార్గదర్శిలో తన షేర్లను ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో బలవంతంగా లాక్కున్నారంటూ.. గాదిరెడ్డి జగన్నాథ రెడ్డి కుమారుడు యూరిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ ఘాటుగా స్పందించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురింపించారు. జగన్ అవినీతిపరుడు కాబట్టే అందరికీ అదే మరకను అంటించాలని శాడిజం చూయిస్తున్నారని బీదా రవిచంద్ర యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Margadarsi Quash Petition: మార్గదర్శి క్వాష్‌ పిటిషన్‌పై విచారణ 8 వారాలు వాయిదా

Beda Ravichandra Comments: ''యూరిరెడ్డికి అన్యాయం జరిగిందని చెప్తున్న సమయంలో రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ సమయంలో మార్గదర్శిపై ఫిర్యాదు చేయలేదంటే కచ్చితంగా యూరిరెడ్డి చేప్తువన్నీ అసత్య ఆరోపణలేనని స్పష్టంగా తెలుస్తోంది. యూరిరెడ్డి చెప్పేది కట్టు కథలు కాబట్టే కేసు మూలాలు ఉన్న హైదరాబాద్‌ను కాదని విజయవాడలో కేసు పెట్టారు. అన్నం పెట్టిన చేతినే నరికే నైజం సజ్జలది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తన మీడియా సంస్థల ద్వారా రామోజీరావు ప్రశ్నిస్తున్నందుకే మార్గదర్శిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏం చేసినా ఎవ్వరూ తమని ప్రశ్నించకూడదనే జగన్ ధోరణి దేనికి సంకేతం..?, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అధికారులు దేనికైనా బరితెగిస్తారా..?'' అని బీదా రవిచంద్ర యాదవ్ ప్రశ్నించారు.

Yuri Reddy Press Conference Against Margadarsi: విలేకరుల సమావేశంలో తడబడిన యూరిరెడ్డి..

Beda Ravichandra on Cm Jagan:దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు, జగన్ కుటుంబం ఓదార్పు యాత్రలు చేపట్టినప్పుడు ఈనాడు, ఈటీవీ ఇచ్చిన కవరేజ్‌ని మరిచారా..? అని బీదా రవిచంద్ర యాదవ్ నిలదీశారు. అవినీతి కేసుల్లో జగన్ జైలుకెళ్లాడు కాబట్టే, నీతిమంతులందరినీ జైలుకు పంపే కుట్ర చేస్తున్నాడని ఆక్షేపించారు. జగన్ మెప్పు కోసం అతిగా ప్రవర్తించే అధికారులు ఓసారి గతం గుర్తుచేసుకోవాలని ఆయన హితవు పలికారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలానే నిబంధనలు అతిక్రమించి.. పని చేసిన అధికారులకు పట్టిన గతి మర్చిపోయారా..? అని ప్రశ్నించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం నిబంధనలకు విరుద్ధంగా పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని బీదా రవిచంద్ర యాదవ్ హెచ్చరించారు. ఇప్పటికైనా మార్గదర్శిపై అసత్య ఆరోపణలు, అక్రమ కేసులు బనాయించటం తక్షణమే మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

''ఈనాడు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుని ఏదో రకంగా అరెస్టు చేయాలనే కుట్రతోనే జగన్మోహన్ రెడ్డి జగన్నాటకం చేస్తున్నాడు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే ఈనాడు, ఈటీవీ సంస్థలపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. 60 ఏళ్ళుగా నమ్మకంగా ఉన్న మార్గదర్శి సంస్థపై వైసీపీ జేబు సంస్ధ సీఐడీతో వేధింపులకు పాల్పడుతున్నారు. పోలీస్ యంత్రాంగంతో కుమ్మకై యూరిరెడ్డితో తప్పుడు కేసు పెట్టించి, అప్రజాస్వామ్య పద్దతిలో నడుస్తున్నారు. మార్గదర్శిపై ఇప్పటికే తప్పుడు కేసులు పెట్టారు. మళ్లీ ఈరోజు ఏడేళ్ల క్రితం జరిగిన షేర్ బదలాయింపు అని సీఐడీతో కక్షపూరితంగా కేసులు పెట్టించారు. పోస్టింగులకు కక్కుర్తిపడ్డ అధికారులతో ఈ పనులను చేయిస్తున్నారు ఆక్షేపించారు. కశ్మీర్‌లో కూడా లేని అరాచకం ఏపీలో జరుగుతోంది.'' -దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి.

False Cases Against Margadarsi Chitfunds: మార్గదర్శిపై బురద చల్లేందుకు పచ్చి అబద్ధాలతో ఏపీసీఐడీ కాకమ్మ కథలు

ABOUT THE AUTHOR

...view details