TDP-Janasena 2nd coordination committee Updates: తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ రెండో సమావేశం విజయవాడలో గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ రెండో సమావేశానికి టీడీపీ తరఫున.. నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్యగా హాజరవ్వగా.. జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పాలవలస యశస్వి, బొమ్మిడి నాయికర్, మహేందర్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావు పాల్గొన్నారు. నేటి సమావేశంలో ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన, 100 రోజుల ప్రణాళిక, ఓటరు జాబితా అవకతవకలపై ఇరు పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
TDP-Janasena Second meeting at Vijayawada: ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటానికి తెలుగుదేశం, జనసేన పార్టీలు సిద్దమయ్యాయి. 100 రోజుల ప్రణాళిక ఖరారుకు కసరత్తు మొదలుపెట్టాయి. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండాగా రెండు పార్టీలు రెండో సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నాయి. విజయవాడలో ప్రారంభమైన రెండో సమావేశంలో.. మేనిఫెస్టో ప్రకటన లోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఓ కరపత్రం రూపకల్పనకు పూనుకున్నాయి. దీంతో పాటుఓటర్ జాబితా అవకతవకలు పైనా ఉమ్మడి పోరు ప్రణాళికను ఇరుపార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు పార్టీలు ఉమ్మడి జిల్లాల స్థాయిలో ఆత్మీయ సమావేశాల్ని పూర్తి చేసుకునందున్న, రానున్న రోజుల్లో నియోజకవర్గాల స్థాయిలోను ఆత్మీయ సమావేశాల నిర్వహణపై నేటి భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.